ఓటీటీలోకి తమన్నా రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కు సరైన హిట్ పడి చాలా ఏళ్లే అయింది. 2019లో విడుదలైన కబీర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత షాహిద్ కపూర్ కు మళ్లీ ఆ రేంజ్ మూవీ రాలేదనే చెప్పాలి. అయితే ఇటీవల షాహిద్ కపూర్ నుంచి వచ్చిన ఓ రోమియో మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ ఫిబ్రవరి 13 న విడుదలైంది. 10 రోజుల్లో రూ. 150 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.

ఓ రోమియో సినిమాను ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో తమన్నా భాటియా, అవినాష్ తివారీ, నానా పటేకర్, దిశా పటానీ, విక్రాంత్ మాసే వంటి భారీ తారాగణం ఉంది. ముంబై గ్యాంగ్‌ స్టర్ హుస్సేన్ ఉస్తారా జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకంలోని ఒక అధ్యాయం ఆధారంగా ఓ రోమియో సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. రూ. 125 నుంచి 150 కోట్ల బడ్జెట్ తో ఈ ఓ రోమియో సినిమాను తీసినట్లు తెలుస్తోంది. అయితే 10 రోజుల్లో ఈ మూవీ రూ. 150 కోట్ల దిశగా సాగుతోంది. ఫుల్ రన్ లో బయ్యర్స్ కు లాభాల పంట అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాలో షాహిద్ కపూర్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఓ రోమియో మూవీలో సినిమాటోగ్రఫీ, సంగీతం అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. అయితే.. ఈ మూవీలో స్క్రీన్‌ ప్లే మైనస్ అని సమాచారం. అలాగే కథనం కూడా ఊహకు అందే విధంగా ఉండటం వల్ల ఓ రోమియో సినిమాకు అక్కడక్కడా కలెక్షన్స్ తగ్గినట్లు తెలుస్తోంది. ఇక ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ రోమియో ఓటీటీ రైట్స్‌ ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ఓ రోమియో మూవీ ఏప్రిల్ రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ORomeo movie Box Office Fire Crosses Rs 150 Crores in Just 10 Days Massive Blockbuster Run

ఇక దర్శకుడు విశాల్ భరద్వాజ్, షాహిద్ కపూర్ కాంబినేషన్‌ లో వచ్చిన నాలుగో సినిమా ఓ రోమియో కావడం విశేషం. ఇదివరకు వీరి కాంబోలో కమీనే (2009), హైదర్ (2014), రంగూన్ (2017) వంటి విభిన్నమైన సినిమాలు చేశారు. అయితే కబీర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూసిన షాహిద్ కపూర్ కు ఈ మూవీ కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+