RRR రికార్డ్‌ను ఆ ఫిల్మ్ చెరిపేస్తుందా.. నో డౌట్

Oscar 2024: టాలీవుడ్ మొదలుకుని హాలీవుడ్ దాకా.. సినిమా ప్రపంచం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల సందడి మొదలైంది. ప్రతి సంవత్సరం మార్చి 12వ తేదీన అమెరికాలోని కాలిఫోర్నియా బేవర్లీ హిల్స్‌లో కళ్లు చెదిరేలా ఈ అవార్డుల ఫంక్షన్ ఏర్పాటవుతుంటుంది.

ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం ఎంపికయ్యే సినిమాలు, డాక్యుమెంటరీల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉత్తమ చిత్రాల కేటగిరీలో 10 సినిమాలు నామినేట్ అయ్యాయి. మిగిలిన అన్ని విభాగాల్లో అయిదేసి చొప్పున సినిమాలు/డాక్యుమెంటరీలను ఆస్కార్ అవార్డుల జ్యూరీ ఎంపిక చేసింది.

Oscar 2024: Indian documentary To Kill A Tiger gets nomination

బెస్ట్ ఫిల్మ్ విభాగంలో- అమెరికన్ ఫిక్షన్, అనాటమీ ఆఫ్ ఎ ఫాల్, బార్బీ, ది హోల్డోవర్స్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, మ్యాస్ట్రో, ఒప్పెన్‌హైమర్, పాస్ట్ లైవ్స్, పూర్ థింగ్స్, ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఎంపిక అయ్యాయి. ఉత్తమనటుడి కేటగిరీలో- బ్రాడ్లే కూపర్ (మ్యాస్ట్రో), కోల్మన్ డొమింగో- రస్టిన్, పాల్ గామెట్టి- ది హోల్డోవర్స్, సిలియన్ మర్ఫీ- ఒప్పెన్‌హైమర్, జెఫ్రీ రైట్- అమెరికన్ ఫిక్షన్ ఉన్నారు.

ఉత్తమ నటి విభాగంలో- అన్నెట్టి బెనింగ్- న్యాడ్, లిలీ గ్లాడ్‌స్టన్- కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, శాండ్రా హల్లర్- అనాటమీ ఆఫ్ ఎ ఫాల్, క్యారీ ముల్లిగన్- మ్యాస్ట్రో, ఎమ్మా స్టోన్- పూర్ థింగ్స్ నామినేట్ అయ్యారు. బెస్ట డైరెక్టర్ విభాగంలో- జస్టిన్ ట్రీట్- అనాటమీ ఆఫ్ ఎ ఫాల్, మార్టిన్ స్కోర్సెస్సె- కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, క్రిస్టొఫర్ నోలాన్ - ఒప్పెన్‌హైమర్, యార్గొస్ లాంథిమస్- పూర్ థింగ్స్, జొనాథన్ గ్లేజర్- ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఉన్నారు.

Oscar 2024: Indian documentary To Kill A Tiger gets nomination

గత ఏడాది ఆస్కార్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ హవా కొనసాగిన విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట దుమ్ము లేపింది. ఆస్కార్ అవార్డును అందుకుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్.. భారతీయ జెండాను రెపరెపలాడించారు. అలాగే- బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ది ఎలిఫెంట్ విష్పర్స్.. ది బెస్ట్‌గా నిలిచింది.

ఈ సారి కూడా అలాంటి పరిస్థితే రావొచ్చు. భారత్ తరఫున బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో భారత్ నిలిచింది. టు కిల్ ఎ టైగర్ ఎంపికైంది. బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్, ది ఎటర్నల్ మెమరీ, ఫోర్ డాటర్స్, 20 డేస్ ఇన్ మరియాపోల్..‌తో పోటీ పడబోతోంది.

Oscar 2024: Indian documentary To Kill A Tiger gets nomination

జార్ఖండ్‌లో తెరకెక్కిన కెనడియన్ ఫీచర్ డాక్యుమెంటరీ ఫిల్మ్.. టు కిల్ ఎ టైగర్. ఢిల్లీకి చెందిన నిషా పహూజా దర్శకత్వం వహించారు. సామూహిక అత్యాచారానికి గురైన 13 సంవత్సరాల బాలిక తండ్రి.. న్యాయం కోసం ఎలా పోరాడారనేదే ఈ డాక్యుమెంటరీ ఇతివృత్తం. కెనడాకు చెందిన ప్రొడక్షన్ హౌస్ దీన్ని తెరకెక్కించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+