Oscar : ఆస్కార్ స్టేజీపైకి న‌గ్నంగా వ‌చ్చిన నటుడు...ఫోటోలు వైర‌ల్‌..

96వ ఆస్కార్(Oscar) వేడుకలు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో నేడు ఎంతో వైభ‌వంగా జ‌రిగాయి. ఈ సారి జ‌రిగిన ఈ అవార్డుల్లో ఓపెన్ హైమర్, పూర్ థింగ్స్ చిత్రాలు ఎక్కువ అవార్డులు సొంతం చేసుకున్నాయి. అయితే, ఈ అవార్డుల్లో హాలీవుడ్ న‌టుడు న‌గ్నంగా వేదిక‌పైకి వ‌చ్చి అక్క‌డున్న‌వారంద‌ర‌నీ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యేలా చేశారు.

పాపులర్ అమెరికన్ రెజ్లర్, WWE ఫేమ్ జాన్‌సీనా ఆస్కార్ వేడుక‌ల్లో హాల్‌చ‌ల్ చేశారు. ఆస్కార్ వేదిక‌పైకి ఆయ‌న న‌గ్నంగా వ‌చ్చి అంద‌రినీ విస్మయానికి గురిచేశారు. న‌టుడు జాన్‌సీనాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఇండియాలో కూడా జాన్‌సీనకు అభిమానులు ఉన్నారు. జాన్‌సీన కూడా నటుడిగా కొన్ని యాక్షన్ సినిమాల్లో కూడా న‌టించారు. అయితే, నేడు జరిగిన ఆస్కార్ వేడుకలకు జాన్‌సీన కూడా విచ్చేసారు. అయితే ఆయ‌న‌ను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని ప్రకటించడానికి స్టేజీపైకి ఆహ్వానించారు.

Oscar The actor who came naked on the Oscar stage photos are viral

ఎన్వ‌ల‌ప్ క‌వ‌ర్‌ను అడ్డుపెట్టుకుని...

దీంతో జాన్‌సీన ఒంటిమీద ఏమి లేకుండా నగ్నంగా స్టేజీపైకి వ‌చ్చారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన‌ర్ అవార్డును ప్ర‌క‌టించే క్ర‌మంలో ఆయ‌న ఇలా రావ‌డంతో అంద‌రూ ఒక్కసారిగా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఆయ‌న కేవలం ముందు వైపు ప్రైవేట్ పార్ట్ వద్ద ఓ అవార్డులు ప్ర‌క‌టించే ఎన్వ‌ల‌ప్ క‌వ‌ర్‌ను అడ్డుగా పెట్టుకొని వేదిక‌పైకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత‌ జాన్‌సీన మైక్ వద్దకు వచ్చి కాస్ట్యూమ్స్ అందుకే ఎంతో ముఖ్య‌మ‌ని చెప్పడంతో అందరూ ఘెల్లున నవ్వేశారు. వెంటనే కొంతమంది వచ్చి జాన్‌సీనకు చీరలా చుట్టుకునే కాస్ట్యూమ్ ఒకటి స్టేజిపైనే వేశారు. ఆ త‌ర్వాత న‌టుడు జాన్‌సీన బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని ప్రకటించారు. ఈ సారి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌ అవార్డు పూర్ థింగ్స్‌ సినిమాకు గాను హోలి వెడ్డింగ్‌టన్ ఈ అవార్డును అందుకోవ‌డం జ‌రిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+