శవమై తేలిన ప్రముఖ నటుడు.. అతని భార్య, పెంపుడు కుక్క కూడా..

ఆస్కార్ అవార్డ్ గ్రహీత, హాలీవుడ్ నటుడు జీన్ హ్యాక్‌మాన్, ఆయన భార్య బెట్సీ అరకవ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అంతేకాక వారి పెంపుడు కుక్క కూడా చనిపోయింది. న్యూ మెక్సికోలోని హ్యాక్‌మాన్ ఇంట్లో ఈ ఘటన జరిగింది. శాంటా ఫీ కౌంటీ పోలీసు అధికారి ఆడ‌న్ మెండోజా ముగ్గురి మ‌ర‌ణాల‌ను ద్రువీక‌రించారు. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ‌లో ఉన్న‌ట్లు చెప్పారు.

జీన్‌హ్యాక్‌మాన్ 1930లో కాలిఫోర్నియాలో జ‌న్మించారు. ఆయ‌న వంద‌కుపైగా పాత్ర‌లు పోషించారు. హాలీవుడ్‌లో అందరి నుంచి గౌరవ మర్యాదలు పొందిన అతికొద్ది మంది నటుల్లో జీన్‌ హ్యాక్‌మాన్ ఒకరు. యాక్షన్, థ్రిల్లర్స్, కామెడీ... ఇలా అన్ని జానర్లలో ఆయన సినిమాలు చేశారు.

Oscar-winning actor Gene Hackman and his wife Betsy Arakawa were found dead

జీన్‌హ్యాక్‌మాన్ 5 సార్లు ఆస్కార్ కు నామినేట్ అయ్యారు. ఆయన కెరీర్లో మొత్తం రెండుసార్లు ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్నారు. ది ఫ్రెంచ్ కనెక్షన్ అనే సినిమాకు మొదటిసారి ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఆ తరువాత అన్‌ఫర్‌గివెన్ సినిమాకు ఆయన రెండోసారి ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నారు. ఆయన మృతిపై హాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఫ్యాన్స్ శోకసంద్రంలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+