ఆస్కార్ బెస్ట్ పిక్చర్ అవార్డుల జాబితాలో..: కీరన్ కొట్టేశాడు
Oscar Awards 2025: హాలీవుడ్‌లో బిగ్గెస్ట్ వేడుక.. ఆస్కార్ అవార్డుల సందడి గ్రాండ్‌గా ఆరంభమైంది. ఇది 97వ ఎడిషన్. భారత కాలమాన ప్రకారం ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:30 గంటలకు ఈ ప్రదానోత్సవం ప్రారంభమైంది. స్టార్ మూవీస్ సెలెక్ట్, స్టార్ మూవీస్‌తో పాటు జియో హాట్ స్టార్ దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తోన్నాయి. అమెరికా కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్ దీనికి వేదిక.
అమెరికాకు చెందిన ప్రముఖ కమేడియన్, రైటర్, టెలివిజన్ హోస్ట్ కానన్ ఓబ్రియాన్ కానన్ ఓబ్రియాన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించారు. తన దైన శైలిలో నవ్వులు పూయించారు. రాబర్ట్ డౌనీ జూనియర్, సెలెనా గోమెజ్, ఆడ్రియాన్ బ్రాడీ, జార్జియానా ఛాప్‌మన్, ఎమ్మా స్టోన్, అమీ పోహ్లెర్.. వంటి సెలెబ్రిటీలు రెడ్ కార్పెట్‌పై మెరిశారు.

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డును అమెరికాకు చెందిన పాల్ టేజ్‌వెల్ గెలుచుకున్నారు. విక్డ్ సినిమా ఆయనకు ఈ అవార్డును తెచ్చి పెట్టింది. ది బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు.. ఫ్లోకు దక్కింది. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ అవార్డును ఇన్ ద షాడో ఆఫ్ ది సైప్రెస్ దక్కించుకుంది. షిరిన్ సొహానీ, హొస్సైన్ మోలయెమి ఈ అవార్డును అందుకున్నారు.
ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు కీరన్ కుల్కిన్స్. ది రియల్ పెయిన్ సినిమాలో ప్రదర్శించిన నటనకు ఆయనకు ఈ పురస్కారం లభించింది. బెస్ట్ పిక్చర్ అవార్డుల జాబితాలో అనోరా, ఎమిలియా పెరెజ్, ది సబ్‌స్టాన్స్, డ్యూన్: పార్ట్ 2, విక్డ్, నికెల్ బాయ్స్, కాంక్లేవ్, ఐయామ్ స్టిల్ హియ్, ది బ్రూటలిస్ట్, ఎ కంప్లీట్ అన్‌నోన్.. పోటీ పడుతున్నాయి.
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డును సీన్ బేకర్ సొంతం చేసుకున్నారు. అనోరా మూవీకి గాను ఈ అవార్డు లభించింది. ది బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే పురస్కారాన్ని కంక్లేవ్ మూవీ సొంతం చేసుకుంది. బెస్ట్ ఫిల్మ్ అవార్డు కోసం కూడా ఈ సిినిమా నామినేట్ అయింది. ది సబ్‌స్టాన్స్ మూవీకి బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అవార్డు లభించింది.












Click it and Unblock the Notifications