పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా.. అందరూ మహేష్‌బాబు, రాజమౌళి కాలేరుగా!
పులికి చారలున్నాయని అసూయపడిన నక్క తనకు కూడా చారలు రావాలని వాతలు పెట్టుకుంది. అవి బాగా కాలడంతో నొప్పి భరించలేక కేకలు పెట్టింది. ఎదుటివారిని చూసి తమకు కూడా అలానే కావాలంటే అనుభవాలు ఇలాగే ఉంటాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న పాన్ వరల్డ్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే రాజమౌళి నుంచి సినిమా వస్తోందంటే భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని అన్ని భాషల్లో ఉన్న దర్శకులు, సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మార్కెటింగ్ మేనేజర్ గా రాజమౌళి
రాజమౌళి అటువంటి స్థాయికి వెళ్లడానికి కారణం ఒక్కటే. దర్శకుడిగా తాను అనుకున్నరీతిలో సినిమా వచ్చేవరకు కష్టపడతారు. సినిమా పూర్తయిన తర్వాత కొత్త బాధ్యతలు తీసుకుంటారు. అవేంటంటే.. మార్కెటింగ్ మేనేజర్. సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి? ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి? ఏ విధంగా ప్రమోషన్స్ నిర్వహిస్తే సినిమా ఎక్కువమందికి చేరుతుంది?.. తదితర విషయాలపై ఆయనకున్న పట్టు దేశంలోని దర్శకులెవరికీ లేదు. విడుదలైన తర్వాత సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందంటే అందుకు ప్రధాన కారణం రాజమౌళి.

కొంతమంది ఇదే బాటలో పయనిస్తున్నారు
ప్రమోషన్స్ చేయడానికి ఎవరు సమర్థులో గుర్తించి ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇక్కడ ఎంపిక చేసిన సంస్థలపైనే సినిమా విజయం సగం దక్కుతుంది. విడుదలైన తర్వాత మిగతా సగం దక్కుతుంది. ప్రస్తుతం రాజమౌళి-మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ స్ట్రాటజీ చూసిన తర్వాత కొంతమంది హీరోలు, దర్శకులు కూడా పాన్ వరల్డ్ బాట పడుతున్నారు. అందుకు తగినట్లుగా, ఆ స్థాయిలో, ఆ ప్రమాణాలతో తాము సినిమాను రూపొందిస్తున్నామా? లేదా? అనేది చూసుకోవాలి. అలా వెళ్లగలం అనుకుంటేనే హాలీవుడ్ స్థాయికి వెళ్లాలి. అంతేకానీ.. వారు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారని, తాము కూడా అలాగే తీస్తే.. మనం పైన చెప్పుకున్నట్లుగా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లవుతుంది.












Click it and Unblock the Notifications