ఓటీటీలో దుమ్మురేపుతున్న కోర్టు డ్రామాలు ఇవే..!
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతుంటాయి. తెలుగుతోపాటుగా ఇతర భాషల్లోనూ ఇవి స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఓటీటీల పుణ్యమా అని దేశంలోని అన్ని భాషల్లోని సినిమాలు, వెబ్ సిరీస్ లు తమకు ఇష్టమైన భాషలో చూసే అవకాశం కలిగింది. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో దూసుకెళ్తోంది. అలాగే ఈ వారం చాలా వెబ్ సిరీస్ లు, సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్.. ఇలా అన్ని రకాల జానర్లకు చెందిన సినిమాలు, సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి.
అయితే ఇటీవలి కాలంలో కోర్టు డ్రామాలు ఓటీటీని షేక్ చేస్తున్నాయి. తెలుగులో గతేడాది కోర్టు మూవీ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటీటీల్లో అదరగొడుతున్న కోర్టు డ్రామా వెబ్ సిరీస్ ల వివరాలు చూస్తే.. మొదటిది 'కోర్ట్ కచేరీ' ఇది సోనీ లివ్‌లో విడుదలైన వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో కామెడీ కూడా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ గతేడాది ఆగస్టు 13న విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ ఐఎండీబీలో 7.1 రేటింగ్ సొంతం చేసుకుంది.
అలాగే 'రైజింగ్‌హాని vs రైజింగ్‌హాని' వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక చట్టపరమైన పోరాటం ఆధారంగా రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ 2024లో విడుదలైంది. ఈ సిరీస్‌లో కరణ్ వాహి, జెన్నిఫర్ విజెంట్, రీమ్ షేక్ నటించారు. ఇక రైజింగ్‌హాని vs రైజింగ్‌హానికు అనిరుధ్ రాజ్‌దార్కర్ దర్శకత్వం వహించారు. దీనికి ఐఎండీబీలో 6.2 రేటింగ్ దక్కింది.
మరో వెబ్ సిరీస్ 'గుడ్ బ్యాడ్ గర్ల్'.. ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఒక మధ్యతరగతి అమ్మాయి వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె పేరు మాయా అహుజా. ఆమె కూడా వింత పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ వెబ్ సిరీస్ లో సమృద్ధి దివాన్, వైభవ్ రాజ్ గుప్తా, గుల్ పనాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ కు వికాస్ బహల్ దర్శకత్వం వహించాడు. 2022లో విడుదలైన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక 'యువర్ హానర్' వెబ్ సిరీస్ ను ఈశ్వర్ నివాస్ దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో జిమ్మీ షెర్గిల్, మితా వశిష్ట, యశ్పల్ శర్మ కీలకపాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 22 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ కు ఐఎండీబీలో 7.2 రేటింగ్ దక్కింది.












Click it and Unblock the Notifications