అన్న మరో హిట్ కొట్టిండు!

నేటి కాలంలో కమర్షియల్ హంగులు, యాక్షన్ సినిమాల జోరు పెరిగినా.. పల్లెటూరి నేటివిటీతో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 'మసూద' వంటి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న తిరువీర్, తాజాగా 'పాపం ప్రతాప్' అంటూ పలకరించాడు. 90ల కాలం నాటి గోదావరి అందాలు, అమాయకత్వంతో కూడిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ
గోదావరి జిల్లాలోని ఒక కుగ్రామం. అక్కడ నివసించే ప్రతాప్ (తిరువీర్), తన చిన్ననాటి స్నేహితురాలు బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో.. పెళ్లయిన మూడు రోజులకే ఊరి పంచాయితీలో ప్రతాప్‌కు ఊహించని అవమానం ఎదురవుతుంది. ఆ దెబ్బతో భార్య బుజ్జమ్మ అతడిని వదిలేసి వెళ్ళిపోతుంది. పైగా ప్రతాప్‌కు నిద్రలో ఒక వింత సమస్య ఉంటుంది. ఊరంతా 'పాపం ప్రతాప్' అని జాలి చూపిస్తూనే వెటకారం చేస్తుంటే, ప్రతాప్ తన భార్యను మళ్ళీ ఎలా దక్కించుకున్నాడు? తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుని 'వీర ప్రతాప్'గా ఎలా నిలిచాడు? అనేదే ఈ సినిమా కథ.

Paapam Prathap Movie Review Thiruveer Shines in this Emotional Rural Drama Full Details

ఎలా ఉందంటే?
దర్శకుడు ఎస్‌పి దుర్గా నరేష్ ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నది. కానీ దానికి పల్లెటూరి హాస్యాన్ని, బలమైన ఎమోషన్లను జోడించి హృద్యంగా మలిచారు.

ఫస్టాఫ్: పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మాటలు, అమాయకత్వం చాలా సరదాగా సాగిపోతాయి. హీరోకు ఉన్న వింత సమస్యను రివీల్ చేసిన విధానం, ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తాయి.

సెకండాఫ్: ద్వితీయార్థంలో కథనం కాస్త నెమ్మదించింది. ఊరి జనం పదే పదే హీరోను అవమానించే సీన్లు రిపీట్ కావడం కొంత బోర్ కొట్టిస్తుంది. కొన్ని డబుల్ మీనింగ్ జోకులు లేకపోయినా సినిమా బాగుండేది. కానీ, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్
ఈ సినిమాకు ప్రధాన బలం తిరువీర్ నటన. భార్య దూరమైన బాధను, లోపల ఉన్న ఆవేదనను తన కళ్లతోనే పలికించాడు. ఒక సగటు మధ్యతరగతి భర్త పడే కష్టాలను అద్భుతంగా పండించాడు. బుజ్జమ్మ పాత్రలో పాయల్ రాధాకృష్ణ చాలా సహజంగా ఉంది. పల్లెటూరి అమ్మాయిగా ఆమె నటన ఎమోషనల్ సీన్స్‌లో మెప్పిస్తుంది. అజయ్ ఘోష్, రఘుబాబు, గోపరాజు రమణల కామెడీ టైమింగ్ సినిమాకు అసెట్. చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన సీనియర్ నటి రాశి తన పాత్రకు న్యాయం చేశారు. అవసరాల శ్రీనివాస్ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక వర్గం
చాలా కాలం తర్వాత కేఎం రాధాకృష్ణన్ అందించిన పాటలు వినడానికి ఇంపుగా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సీన్లను బాగా ఎలివేట్ చేసింది. విశ్వేశ్వర్ ఎస్.వి సినిమాటోగ్రఫీ గోదావరి అందాలను ఫ్రెష్‌గా చూపించింది. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

పంచ్ లైన్: 'పాపం ప్రతాప్'.. మనసును హత్తుకునే స్వచ్ఛమైన గ్రామీణ వినోదం.

*రేటింగ్: 3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+