Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ త్వరలోనే విడిపోతారు... నటుడు సంచలన పోస్ట్

ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగవైభంగా జరిగింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. అంబానీ ఇంట మూడురోజులపాటు పెళ్లి వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలంతా ఈ వివాహానికి తరలివచ్చారు.

ముంబయిలోని వీధులన్నీ అతిథులతో నిండిపోయాయి.దాదాపుగా 2500 మంది ముఖ్యఅతిథులుగా వచ్చారని తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అంబానీ ఇంట పెళ్లిలో తెగ సందడి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు సైతం ఈ వివాహానికి రావడం జరిగింది. టీమిండియా క్రికెటర్లు , మాజీ ఆటగాళ్లు సైతం ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. దాదాపు మూడు నెలలుగా ఈ వివాహ వేడుకలు జరుగుతున్నాయి.

Pakistani actor Arsalan about Anant Ambani and Radhika Merchant grand wedding

ఇప్పటి వరకు పెళ్లికి ముందు తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ అట్టహాసంగా జరిగాయి. గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా అనంత్ అంబానీ పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి ధరించిన దుస్తులతో సహా అన్ని వస్తువులకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.అలాగే ఈ పెళ్లికి రూ.5000 కోట్లు ఖర్చు అయ్యాయి. అంబానీ ఆస్తుల్లో రూ.5000 కోట్లు అంటే 0.05 శాతం మాత్రమే. ఇది వారికి చాలా చిన్న ఖర్చు. ఇదిలా ఉంటే అంబానీ ఇంట జరిగిన పెళ్లిపై పాకిస్దాన్‌ నటుడు తన అక్కసును వెళ్లగక్కాడు.

Pakistani actor Arsalan about Anant Ambani and Radhika Merchant grand wedding

పాకిస్థాన్ నటుడు అర్సలన్ నజీర్ అనంత్ అంబానీ పెళ్లి గురించి షాకింగ్ పోస్ట్‌ పెట్టాడు. ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు గ్రాండ్‌గా జరుపుకున్నప్పటికీ.. కనీసం అంతకాలం కూడా బంధాలు నిలబడటం లేదంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. అనంత్, రాధిక ఫొటోలు షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అర్సలన్ నజీర్ తీరుపై మండిపడుతున్నారు. శుభామా అంటూ పెళ్లి చేసుకుంటే, విడిపోతారని కామెంట్స్ చేస్తావేంటి అంటూ అతనిపై మండిపడుతున్నారు.వాళ్లు చిన్ననాటి ఫ్రెండ్స్ వారి ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు మధ్యలో నీకేంటి సమస్య? అని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ నటుడు అర్సలన్ నజీర్ నటుడు చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+