బెంగళూరులో 'సలార్' ఊచకోత.. బ్లాస్టింగ్ రికార్డ్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో హోంబలే ఫిలింస్ నిర్మించిన తాజా సంచలనం సలార్. ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.550 కోట్లకు పైగా వసూలు చేసి రూ.వెయ్యి కోట్ల వసూళ్లుచేసే దిశగా పరిగెడుతోంది. డైనోసార్ దెబ్బకు ఎవరైనా సరే అబ్బా అనాల్సిందే అన్నట్లుగా సలార్ వసూళ్లు ఉన్నాయి. ప్రభాస్ బరిలోకి దిగితే రికార్డులను ఊచకోత కోయడమేనని డార్లింగ్ మరోసారి నిరూపిస్తున్నాడు.
Recommended Video

సలార్ తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో బ్లాస్టింగ్ రికార్డ్ ను నెలకొల్పింది. బెంగళూరు మొత్తం మీద ఈ సినిమాకు 6వేల షోస్ వేశారు. గతంలో కేజీఎఫ్ చిత్రంతోపాటు ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా 6వేల షోస్ వేశారుకానీ వాటిని వేయడానికి 8రోజులు పట్టింది. కానీ సలార్ మాత్రం ఏడురోజుల్లోనే 6వేల షోస్ తో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. వాస్తవానికి ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ తోపాటు నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, ఫొటోగ్రఫీ.. తదితర సాంకేతిక విభాగాలకు పనిచేసినవారు కర్ణాటకకు చెందినవారే.

కర్ణాటకలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించకపోయినప్పటికీ బెంగళూరు మాత్రం దీనికి మినహాయింపు కావడం విశేషం. ఇండియన్ సిలికాన్ వ్యాలీలో సలార్ వీరవిహారం చేస్తోంది. బాలీవుడ్ లో ఈ సినిమా రూ.110 కోట్లకు పైగా షేర్ రాబట్టి రూ.200 కోట్ల వసూళ్లు దిశగా పయనిస్తోంది. ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇప్పటికే 8 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అక్కడ 10 మిలియన్ డాలర్లు వసూలుదిశగా పరిగెడుతోంది. మొదటి ఆరు రోజుల్లోనే హిందీ బెల్టులో రూ.110కోట్ల షేర్ రాబట్టడం అంటే సాధారణ విషయం కాదని, తమ డైనోసార్ ఏంచేసినా భారీగానే చేస్తాడంటూ అభిమానులు మురిసిపోతున్నారు.












Click it and Unblock the Notifications