డార్లింగ్ ఇంద్ర భవనాన్ని చూశారా?
పాన్ ఇండియా రెబల్ స్టార్, ఆరడుగుల అందగాడు, అమ్మాయిల కలల రాకుమారుడు ఎవరయ్యా అంటే డార్లింగ్ ప్రభాస్ అని ఠక్కున చెబుతారు. చెప్పుకుంటూ పోవాలేకానీ రెబల్ స్టార్ ను కొనియాడటానికి మాటలు కూడా సరిపోవు. అభిమానులంతా ముద్దుగా డార్లింగ్ డార్లింగ్ అంటూ పిలుచుకుంటారు. కొద్దిరోజుల్లోనే కల్కి సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను ప్రారంభించబోతున్నారు. తాజాగా తన నివాసంలో కొంతమంది అభిమానులను డార్లింగ్ కలిశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. డార్లింగ్ ఇంటిని చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఒక్కో సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా మారాడు. అయినప్పటికీ ఎంతో సింపుల్ గా ఉంటాడు. కోట్లరూపాయల ఆదాయం ఉన్న వ్యక్తి ఇంత సింపుల్ గా ఉంటాడా? అంటూ అభిమానులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా ప్రభాస్ కు సంబంధించిన వివరాలను ట్రెండ్ చేస్తున్నారు.

ప్రభాస్ ఇల్లు ఓ ఇంద్ర భవనంలా ఉందని, దాన్ని ఒక పద్ధతి ప్రకారం వాస్తు సరిగ్గా ఉండేలా చూసి కట్టుకున్నాడని, ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నారని, ఆ ఇంటిని చూస్తుంటే కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టినట్లుగా ఉందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అభిమానులతో ప్రభాస్ దిగిన ఫొటోలు కూడా వైరల్ గా మారాయి.
దేశంలోనే ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా మారిపోయారు. సినిమా ఫ్లాప్, హిట్ అన్నదాంతో సంబంధం లేకుండా మొదటి మూడురోజుల్లో రూ.300 కోట్ల కలెక్షన్లు రాబట్టడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దేశమంతా ప్రభాస్ మానియాతోనే నిండిపోయింది. బాలీవుడ్ లోని ఇతర హీరోలు ప్రభాస్ సినిమా ఉందంటే ఆరోజు కాకుండా ఇతర రోజుల్లో విడుదల తేదీని పెట్టుకుంటున్నారంటే ప్రభాస్ స్థాయి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డార్లింగ్ క్రేజ్ కు అమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా వెనకబడిపోయారు.












Click it and Unblock the Notifications