'కల్కి' సినిమాకు షాక్ ఇచ్చిన చంద్రబాబు!

అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం కల్కి ఈనెల 27న విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో దీన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన డార్లింగ్ కల్కి చిత్రంతో అంతర్జాతీయ హీరోగా మారిపోనున్నాడనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే తదితర భారీ తారాగణం ఈ చిత్రంలో పాలుపంచుకుంది. రూ.600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించారు.

26న జరుగుతుందా?
ఈ చిత్రానికి సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ను 25వ తేదీన చేయాలనుకున్నారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిని అతిథులుగా నిర్మాత అశ్వనీదత్ ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటంతో చంద్రబాబు వస్తారా? రారా? అనే సందేహం వ్యక్తమైంది. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈవెంట్ ను రద్దు చేశారు. 25 కాకుండా 26వ తేదీన కొంచెం వెసులుబాటు ఉండటంతో ఆరోజు చంద్రబాబు హాజరయ్యే అవకాశముందంటున్నారు. దీంతో ఈవెంట్ ను 26వ తేదీన చేయాలని భావిస్తున్నారు.

pan india rebal star Prabhas latest movie kalki 2898 AD release update

ప్రి రిలీజ్ ఈవెంట్ ఉందా? లేదా?
సినిమా విడుదల తేదీ 27. దీనికి ఒకరోజు ముందు ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించడంవల్ల పెద్దగా ఒనగూరేదేమీ లేదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 27 రిలీజ్ కాబట్టి 26వ తేదీన చాలా పనులుంటాయి. ఆ పనులన్నీ మానుకొని ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం సాధ్యపడంటున్నారు. దీంతో ఈవెంట్ జరుగుతుందా? లేదా? అనే టెన్షన్ లో అభిమానులున్నారు. ఇండియాలో ఈ సినిమాకు లభించే ఆదరణను బట్టి ప్రపంచవ్యాప్తంగా మిగతా భాషల్లో విడుదల చేయాలనే నిర్ణయానికి చిత్ర యూనిట్ రానుంది. హాలీవుడ్ సినిమా స్థాయిలో దీన్ని విడుదల చేయాలని, అందుకు తగ్గ కథ ఇందులో ఉందని దర్శకుడు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+