డబ్బులు కోసం అడల్ట్ సినిమాలు చేశా
టాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఏసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలామంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అయ్యారు. సినీ పరిశ్రమలో మన వాళ్లు ఎవరు లేనప్పుడు వేషాలు దొరకవు. అలా సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే చాలా కష్టం. ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వేరే దారి లేక రకరకాల పనలు చేయాల్సి ఉంటుంది. తాజాగా తన సినిమా కష్టాలు గురించి ప్రముఖ నటుడు చెబుతూ తన ఆవేదనను బయటపెట్టుకున్నాడు.
నటుడు దుర్గేష్ కుమార్ పేరు తెలుగులో పెద్దగా తెలియకపోవచ్చు కానీ..బాలీవుడ్‌లో మాత్రం దుర్గేష్ కుమార్‌కు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా పంచాయిత్ వెబ్ సీరిస్‌తో దుర్గేష్ కుమార్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. పంచాయిత్ వెబ్ సీరిస్ తర్వాత దుర్గేష్ కుమార్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. దుర్గేష్ కుమార్ తాజాగా మీడియాలో మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.2016లో నేను ముంబయికి వచ్చాను.

కెరీర్ మొటట్లో వరస పెట్టి ఆడిషన్స్‌కు వెళ్తూనే ఉండేవాడిని. కొందరు ఫ్రెండ్స్ అయ్యారు. మేమందరం ఎలాగైనా సరే ఇండస్ట్రీలోకి నిలబడాలనుకున్నాం. కానీ ఛాన్సుల కోసం ప్రతి క్యాస్టింగ్ డైరెక్టర్‌కి దగ్గరకెళ్లి, వాళ్ల కాళ్ల మీద పడ్డాం. చేతులో డబ్బులు ఉండేవి కాదు. చేసేదేమీ కనపడలేదు. ఇక 2013-2022 వరకు కాస్టింగ్ కు వెళ్లిన అవకాశాలు రాలేదన్న ఆయన.. సాప్ట్ పోర్న్ సినిమాలు చేయమని ఒత్తిడి చేశారని, తను ఉన్న పరిస్థితుల్లో మనీ కోసం చేయక తప్పలేదని ఒప్పుకున్నాడు. కాగా ' హైవే ' , ' సుల్తాన్ ' , ' ఫ్రీకి ఆలీ ' లాంటి సినిమాల్లో చేశాక కూడా ఛాన్స్ ల కోసం ఇలాంటి బాధలు పడ్డానని వివరించాడు.












Click it and Unblock the Notifications