సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టడంలో నీ తర్వాతే ఎవరైనా అన్నా..!

ఇప్పుడున్న రోజుల్లో సినిమా అంటే బూతులు, అర్థం కాని పాటలు, ఐటెం సాంగ్స్, ఫుల్ యాక్షన్, భారీ బడ్జెట్ వీఎఫ్ఎక్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కానీ స్వచ్చమైన పల్లెటూరి నేపథ్యంలో ఫ్యామిలీ అంతా ఒకే చోట కూర్చుని హాయిగా నవ్వుకునే సినిమాలు రావడం లేదు. అయితే టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ ప్రస్తుతం ఇలాంటి కథలనే ఎంచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ మెప్పిస్తున్నాడు.

తిరువీర్ సినిమా ప్రయాణం 2016లో 'బొమ్మల రామారం' సినిమాతో మొదలైంది. ఆ తర్వాత జార్జి రెడ్డి మూవీలో లలన్ సింగ్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత పలాస 1978 సినిమాలో నటించి మెప్పించాడు. ఇక సిన్ వెబ్ సిరీస్, నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ ప్రాజెక్టుల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2022 లో వచ్చిన మసూద సినిమాతో హీరోగా తొలి హిట్ అందుకున్నాడు తిరువీర్. హారర్ థిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో తిరువీర్ కు భారీగా అవకాశాలు పెరిగాయి.

ఆ తర్వాత పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో లాంటి చిత్రాలతో వరుస హిట్స్ కొట్డాడు. తాజాగా తిరువీర్ నటించిన 'పాపం ప్రతాప్' మూవీ విడుదలైంది. ఈ మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు తిరువీర్. పాపం ప్రతాప్ మూవీ వేసవి కానుకగా ఏప్రిల్ 17 విడుదలైంది. రిలీజైన అన్ని థియేటర్లలో మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్లు సమాచారం.

ప్రతాప్, బుజ్జమ్మ ప్రేమించుకుంటారు. పెద్దలు వీరికి పెళ్లి చేస్తారు. అయితే ఏమైందో తెలియదు.. పెళ్లయిన మూడు రోజులకే బుజ్జమ్మ ప్రతాప్ ను వదిలి వెళ్లిపోతుంది. అందు గల కారణం ఏంటి..? అనే కొత్త స్టోరీ లైన్ తో సినిమా మొత్తం సరదాగా సాగేలా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా హీరో తిరువీర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తిరువీర్ యాక్టింగ్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. తన సహజమైన నటనతో అందరినీ నవ్వించాడు తిరువీర్. అలాగే పాపం ప్రతాప్ మూవీలో కామెడీ సన్నివేశాలు కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. దాంతో తిరువీర్ ఖాతాలో మరో హిట్ పడ్డట్లుగానే భావించవచ్చు.

PapamPratap Box OfficeSuccess Thiruveer Scores Another Hit with Sensational Collections PapamPratap

పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్. పీ దుర్గ నరేష్ దర్శకత్వం వహించారు. అలాగే రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. పాయల్ రాధకృష్ణ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. బుజ్జమ్మ పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ కొనుగోలు చేసింది. ఇక రానున్న రోజుల్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+