సమ్మర్ రిలీజ్ నుంచి తప్పుకున్న పెద్ద సినిమా.. షాక్ లో ఫ్యాన్స్..

నేచురల్ స్టార్ నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. టాక్ తో సంబంధం లేకుండా నాని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుంటాయి. అయితే నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో సినిమా 'ప్యారడైజ్'.. ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. నాని లుక్స్ దగ్గర్నుంచి గతంలో రిలీజైన టీజర్ వరకూ అన్నీ ట్రెండ్ సెట్టర్ గా మారాయి. టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ చిత్ర సీమలో ఎన్నడూ చేయని బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సిద్ధం అవుతోంది. అయితే 'ప్యారడైజ్' మూవీ మార్చి 27 న రిలీజ్ అని అంతా అనుకున్నారు. ఈ డేట్ ను చిత్ర యూనిట్ చాలా నెలల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

కానీ తాజాగా 'ప్యారడైజ్' చిత్ర నిర్మాణ సంస్థ షాకింగ్ ప్రకటన చేసింది. ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది. 'ప్యారడైజ్' మూవీని మార్చి 27 నుంచి ఆగస్టు 21 ను వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్​ ను తాజాగా రిలీజ్ చేసింది. అందులో రెండు వైపులా జడలు కనిపిస్తున్నాయి. జడల చివర్లో రక్తంతో తడిసినట్లు ఉంది. 'ఆగస్టు 21 నుంచి జడల్ జమానా షురూ కానుంది' అని క్యాప్షన్ రాసుకొచ్చింది.

అయితే ప్యారడైజ్ మూవీ వాయిదా పడుతుంది అంటూ గతంలో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అదే నిజం అయింది. ఈ వేసవికి అటు టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో చాలా సినిమాలే రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సోలో రిలీజ్ డేట్ కోసం ప్యారడైజ్ మూవీని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది, రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్, రణ్ వీర్ సింగ్ ధురంధర్ 2.. ఇలా చాలా సినిమాలు సమ్మర్ రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ మూవీ వాయిదా పడినట్లు స్పష్టం అవుతోంది.

paradise Postponement Nani s Film Moves to August 21 Quality First for This High Budget Action

ఇక ప్యారడైజ్ మూవీని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో గతంలో దసరా మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దాంతో ప్యారడైజ్ మూవీపై అంచనాలు భారీగా నెలకున్నాయి. ఇక ఈ మూవీలో నాని సరసన కయాదు లోహార్ హీరోయిన్​ గా నటిస్తోంది. రాఘవ జూయాల్, సోనాలి కుల్‌కర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ తెలుగుతో పాటు మొత్తం 8 భాషల్లో ఆగస్టు 21న రిలీజ్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+