స్టార్ హీరోయిన్‌కి కళ్లు చెదిరే కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన పవన్ స్టార్..!
పవన్ కళ్యాణ్... ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలకు ఫ్యాన్స్ ఉండడం సహజమే కానీ పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోల్లోనే అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలు హిట్ అయ్యినా, ఫ్లాప్ అయినా అభిమానుల ఎనర్జీ మాత్రం ఎప్పటికీ తగ్గదు. అందుకే పవన్ కళ్యాణ్ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ఆయన చూడని బాక్సాఫీస్ రికార్డులు లేవు. పవన్ పేరు వినగానే థియేటర్లు పండగ వాతావరణంలో మునిగిపోతాయి.
తిరుగులేని ఫ్యాన్‌బేస్ సొంతం చేసుకున్న పవర్ స్టార్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత లాయల్ ఫ్యాన్‌బేస్ కలిగిన హీరోల్లో ఒకరు అనడంలో సందేహం లేదు. ఒక వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్‌లో రెండు సినిమాలున్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న " ఓజీ " సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశాయి.

మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అటు రాజకీయాల్లో బిజీగా ఉన్నా చిత్రాల విషయంలో కూడా తాను కమిట్ అయిన వాటిని ఫినిష్ చేసేశారు. అయితే ఆన్‌స్క్రీన్ విషయాలు పక్కన పెడితే.. ఆఫ్‌స్క్రీన్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ లైఫ్ గురించి మాత్రం హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది.
రూ.24 లక్షల విలువైన గిఫ్ట్..
పవన్ కళ్యాణ్ పెళ్లి విషయంలో రాజకీయంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అలానే సినిమాల గురించి ఎప్పుడు ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొని పవన్.. గతంలో మాత్రం ఒక హీరోయిన్ కి రూ.24 లక్షల విలువైన వజ్రాల హారం గిఫ్ట్‌గా ఇచ్చాడని వార్తలు వచ్చాయి.
ఆమె ఎవరో కాదు పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో కో-స్టార్ పార్వతి మెల్టన్. ఈ వ్యవహారంలో అప్పట్లో చర్చనీయాంశం అవ్వగా.. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఈమె ప్రెగ్నెంట్ అయినట్టు అనౌన్స్ చేయడంతో మళ్లీ తెరపైకి వచ్చింది.

ఒక రోజు పవన్ కళ్యాణ్ లంచ్‌కి పార్వతిని పిలిచి నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చారని.. పార్వతి మొదట అంగీకరించపోయినా.. కానీ "ఇది స్నేహానికి గుర్తు" అంటూ పవన్ చెప్పడంతో తీసుకుందని పత్రికల్లో, మీడియాలో పెద్ద చర్చ నడిచింది. అయితే ఆ తరువాత పవన్ సన్నిహితులు ఈ వార్తను కొట్టిపారేశారు. అలాంటి గిఫ్ట్ అసలు ఇవ్వలేదని, ఇది పూర్తిగా తప్పుడు రూమర్ మాత్రమేనని చెప్పారు.












Click it and Unblock the Notifications