పవన్ కల్యాణ్-రామ్ గోపాల్ వర్మ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 12వ తేదీన హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేస్తున్నారు. దీనితర్వాత సెప్టెంబరులో ఓజీ, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేసి పరిశ్రమకు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో రామ్ గోపాల్ వర్మతో ఓ సినిమా చేయాల్సివుంది. కానీ అది వీలుకాలేదు. వర్మ ఒక అద్భుతమైన సబ్జెక్టుతో పవన్ కల్యాణ్ ను కలిశారు. అన్యాయంపై పోరాడే వ్యక్తి పాత్రలో పవన్ ను చూపించాలనుకున్నారు. స్వతహాగా పవన్ నిజజీవితంలో కూడా అలాగే ఉంటారు కాబట్టి పవన్ తోనే తీయాలన పట్టుదలను ప్రదర్శించారు.

వరుసగా సినిమాలు చేస్తూ బిజీ
అయితే వరుసగా సినిమాలు చేస్తుండటంతో స్క్రిప్ట్ నచ్చినప్పటికీ సినిమా చేయలేపోయాడు. ఆ సినిమాను చేస్తే పవన్ తోనే చేయాలి.. లేదంటే వేరేవారికి సెట్ కాదు అనే ఉద్దేశంతో చివరకు వర్మ దాన్ని పక్కన పెట్టేశాడు. అంతకుముందు పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరుతో కూడా ఓ సినిమా చేయాల్సివుంది. సినిమా ప్రారంభమైంది. ఊర్మిళ, టబు హీరోయిన్లు కాగా నిర్మాత అశ్వనీదత్. సినిమాలో రెండు పాటలు కూడా పూర్తయ్యాయి. అయితే ఈలోగా సంజయ్ దత్ బెయిల్ పై విడుదల కావడంతో సినిమాను మధ్యలో వదిలేసి వర్మ ముంబయి వెళ్లిపోయాడని చెబుతారు. వాస్తవం ఏమిటో వారికే తెలియాలి.

pawan kalyan and ramgopalvarma combination missed block buster movie details here

దేశంలో అతన్ని మించినవారుండేవారు కాదు
ఏదేమైనప్పటికీ హీరోయిజాని బాగా చూపించే సన్నివేశాలకంటే తాను రాసుకున్న కథ ప్రకారమే సినిమాలు తీసే అలవాటున్న వర్మ ఏ హీరోకు జీహుజూర్ అని మాత్రం అనలేదు. ఆయన శిష్యులు ఎంతోమంది ఇప్పుడు సినీ పరిశ్రమలో విజయవంతమైన స్థానాల్లో ఉన్నారు. వర్మ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఇటీవల చిత్ర విచిత్రంగా ప్రవర్తించి, అనవసరపు ప్రకటనలు చేసి, వైసీపీకి మద్దతుగా నిలిచి వర్మకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఏమిటి అని అందరూ ప్రశ్నించుకునేలా చేసుకున్నాడుకానీ అదే స్థాయిలో ఈరోజు వరకు సినిమాలు చేస్తూ ఉంటే దేశంలో అతన్ని మించిన డైరెక్టర్ మరొకరు ఉండేవారు కాదంటే అతిశయోక్తి కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+