హాస్పిటల్ బెడ్‌పై పవన్ మాజీ భార్య.. వీడియో వైరల్!
ప్రముఖ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. పవన్ కళ్యాణ హీరోగా నటించిన 'బద్రి' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత 'జానీ' సినిమాలో మళ్లీ పవన్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత చాలా కాలం సినిమాలకు కొంత దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో కీలక పాత్రలో నటించి రీ ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం సినిమాలు ఏం చేయకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. పలు అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ గా ఆమె రేబిస్ టీకా తీసుకుంటున్న వీడియోను రికార్డు చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫోటోలు లేదా వీడియోలు తీయడం తనకు అలవాటు లేదని.. అయితే ఈసారి ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతోనే ఇలా చేశానని ఆమె తెలిపారు.

ఈ మేరకు ఆ పోస్టులో.. నేను రేబిస్ టీకా తీసుకుంటున్నప్పుడు రికార్డు చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఏ టీకా తీసుకున్నా నేను ఫోటోలు లేదా వీడియోలు తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, సరైన సమయానికి టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఈసారి షేర్ చేయాలనిపించింది" అని రేణు దేశాయ్ వెల్లడించారు. "జంతువులను పెంచుకునే వారు, పశువైద్యులు తప్పనిసరిగా టీకా రికార్డులను నిర్వహించుకోవాలి. నిర్ణీత సమయానికి వ్యాక్సిన్లు తీసుకుంటున్నారో లేదో నిర్ధారించుకోవాలి" అని ఆమె సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
పర్సనల్ లైఫ్..
రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ లకు 2009లో వివాహం జరిగింది. వీరిద్దరికీ అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్‌లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. పవన్ తో విడాకుల తర్వాత ఒంటరి గానే ఉంటున్నారు. మరోవైపు అకీరా నందన్ కూడా సినీ రంగ ప్రవేశం చేయవచ్చనే ప్రచారం చాలా కాలంగా ఉంది. పవన్ నటించిన 'ఓజీ' సినిమాలో అకీరా ఒక కీలక పాత్ర చేశాడని రూమర్లు వినిపించినా.. అవి నిజం కాలేదు. అకీరాను వెండితెరపై చూసేందుకు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది? -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే!












Click it and Unblock the Notifications