దీన స్థితిలో అలనాటి నటి.. చలించిపోయిన పవన్ కళ్యాణ్.. పెద్ద మనసుతో..
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాయం అంటే ఎల్లప్పుడూ ముందుంటారు. అటు సినిమా ఇండస్ట్రీలో అయినా ఇటు ఓట్లేసి తనను తొలిసారి అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలైనా ఆపదని వస్తే సాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. అయితే మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు పవన్ కల్యాణ్. అలనాటి సీనియర్ నటి దీన స్థితిని చూసి చలించి పోయి తక్షణమే సాయం చేసి ఆదుకున్నారు.
అలనాటి టాలీవుడ్ సినిమాల్లో పాకీజాగా పేరుగాంచిన తమిళ నటి వాసుకి. ఇటీవల గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. తన దీన స్థితి గురించి వెల్లడిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు. తాను తమిళంలోనే అనేక సినిమాలు చేశానని.. అయితే తనను తమిళ ఇండస్ట్రీ పట్టించుకోలేదని వాపోయారు. ఏపీ ప్రభుత్వం తనను ఆదుకుంటుందన్న ఆశతో ఇక్కడికి వచ్చానన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు తనకు సాయం చేయాలని ఆమె ప్రాధేయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె దీన స్థితి పై పవన్ కల్యాణ్ స్పందించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి కి డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు.

ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్ కల్యాణ్ తక్షణమే రూ.2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ సాయాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నటి పాకీజాకు అందజేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేసిన సాయానికి పాకీజా భావోద్వేగానికి లోనయ్యారు. పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని పాకీజా ఎమోషనల్ అయ్యారు.
పాకీజా అసలుపేరు వాసుకి కాగా ఆమె తమిళనాడుకు చెందిన నటి. అయితే 1990ల్లో తెలుగు సినిమాలో పాకీజాగా గుర్తింపు తెచ్చుకుంది. మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజాగా వాసుకి పరిచయమైంది. ఆ తర్వాత రౌడీ గారి పెళ్లాం, మామగారు, రౌడీ ఇన్‌స్పెక్టర్, చిట్టెమ్మ మొగుడు, బ్రహ్మ, పెదరాయుడు, రౌడీ ఎమ్మెల్యే, అమ్మా రాజీనామా, సీతారత్నంగారి అబ్బాయి, అన్నమయ్యలాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.












Click it and Unblock the Notifications