ఇక పండగే రోయ్.. "ఓజీ" - "సాహో" కనెక్షన్.. ప్రూఫ్ ఇదే !!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "ఓజీ ". కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనుండగా.. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలానే ఈ చిత్రానికి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ మూవీకి సాహోకి కనెక్షన్ ఉందంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఈ రెండు చిత్రాల మధ్య కనెక్షన్ ఉందని ఫిక్స్ అవుతున్నారు.

ఓజీ - సాహో కనెక్షన్..
కాగా సుజిత్ తెరకెక్కించిన రన్ రాజా రన్ మంచి హిట్ సాధించగా.. సాహోకి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది 'సాహో' సినిమా. ప్రభాస్ కి జంటగా శ్రద్ధ కపూర్ నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం నటించారు. మొదట్లో సినిమాకి ఆశించిన మేర ఫలితం రాకపోయినా తర్వాత మాత్రం మంచి గుర్తింపు దక్కింది.
లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు గతంలో 'సాహో' చిత్రంతో సంబంధం కలిగి ఉన్నాయని పలువురు గుర్తించారు. పవన్ కళ్యాణ్ కటానా పట్టుకుని ఉన్న ఒక షాట్‌లో కనిపించిన గుర్తు.. 'సాహో'లోని వాజీ సిటీ చిహ్నాన్ని పోలి ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అలానే బస్సు దిగుతూ బూట్లు ధరించిన ఒక రహస్య వ్యక్తి షాట్ కనిపిస్తుంది. అవి 'సాహో'లో ప్రభాస్ బూట్లలో కనిపించిన షాట్‌ను పోలి ఉందని కూడా పోస్టులు పెడుతున్నారు.
అంతే కాకుండా గతంలో కూడా టీజర్ వీడియోలోని ఒక షాట్లో వాజి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ అనే బోర్డు షిప్ యార్డ్ కంటైనర్ మీద ఉంటుంది. ఇది సాహోలో మాఫియా సామ్రాజ్యం నడిచే నగరం పేరు. దీంతో రెండింటికి లింక్ ఉందని జోరుగా చర్చ నడుస్తోంది. ఇది సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అని ఫిక్స్ అవుతున్నారు. ఇక మూవీ చివర్లో ప్రభాస్ క్యామియో కనుక ఉంటే సోషల్ మీడియాలో చేస్తున్న వైరల్ కామెంట్స్.. కలెక్ట్ మై బాడీ, శవాలు లేస్తాయ్ .. నరాలు కట్ అవుతున్నాయ్ లాంటివి నిజం అయిపోతాయ్ అంటూ మీమ్స్ చేస్తున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగక తప్పదు.
-
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications