‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి టైమ్ ఫిక్స్.. ఎక్కడంటే ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఓజీ' (OG - Original Gangster). 'సాహో' ఫేమ్ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
కథాంశం..
'ఓజీ' ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఒక గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలానే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

పవన్ పార్ట్‌కి సంబంధించి షూటింగ్ పూర్తి కాగా.. మిగతా ఆర్టిస్టుల షూటింగ్ పార్ట్‌తో పాటు కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. దీనితో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని చూడా జరుపుకుంటున్నారు. ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న 'సువ్వి సువ్వి' అనే రెండో పాటను విడుదల చేయనున్నారు.
ప్రీ-రిలీజ్ ఈవెంట్..
అలాగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఘనంగా నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. సెప్టెంబర్ 18 లేదా 19వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్లు, టీజర్, మరియు ఫస్ట్ సింగిల్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. 'హరిహర వీరమల్లు' సినిమాతో కొంత నిరాశకు గురైన పవన్ అభిమానులు 'ఓజీ'పై భారీ ఆశలు పెట్టుకున్నారు.
You have heard how FIRE sounds.
— DVV Entertainment (@DVVMovies) August 24, 2025
Now feel how love and emotion sing. #SuvviSuvvi will win you over from August 27th, 10:08 AM. ❤️#OG #OGSecondSingle#TheyCallHimOG pic.twitter.com/IXISHMDSYs
మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం "ఉస్తాద్ భగత్ సింగ్". హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications