హరి హర వీరమల్లు ఇక లేనట్లే..? రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన పవన్ కల్యాణ్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లుకు మోక్షం ఎప్పుడో తెలియడం లేదు. ఏళ్లకు ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంది. డైరెక్టర్స్ మారుతూనే ఉన్నారు. కానీ సినిమా మాత్రం పూర్తి కాలేదు. అయితే ఈ మూవీ ఎట్టకేలకు జూన్ 12 రిలీజ్ అవుతోందని అనుకున్నా.. తాజాగా ఈ మూవీ నిరవధిక వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఈ క్రమంలో చిత్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. హరిహర వీరమల్లు చిత్రం నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్, రిలీజ్ కోసం భారీగానే ఖర్చు పెట్టారు. హరిహర వీరమల్లు చిత్రంతో ఆయన తీవ్ర నష్టాల్లోకి వెళ్లారట. దీంతో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్.. తాను తీసుకున్న అడ్వాన్స్ మొత్తం రూ.11 కోట్లు మళ్లీ వెనక్కి ఇచ్ఛేసినట్లు సమాచారం. ఇక క్రిష్, జ్యోతి కృష్ణ.. దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికే డజనుకుపైగా సార్లు వాయిదా పడింది. షూటింగ్ ఏళ్లకు ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఫైనల్ గా జూన్ 12న సినిమా రిలీజ్ అని.. అంతేకాక జూన్ 8న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్పడం తో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయ్యారు. కానీ ఈ రెండూ వాయిదా పడడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Pawan Kalyan Returns 11 Crore Advance to Hari Hara Veera Mallu Producer A M Ratnam

ఇక పవన్ కల్యాణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఓజీ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని సుజిత్ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీతోపాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+