ఎన్టీఆర్ 'దేవర' ను నిండా ముంచిన పవన్ కల్యాణ్?
ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికే రూ.50 కోట్లు రాబట్టింది. తారక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను భావిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న దేవరకు సంబంధించి తెలుగుతోపాటు తమిళం, మళయాళం, కన్నడం, హిందీలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొని సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేశారు. ముఖ్యంగా తమిళంలో నిర్వహించిన ఇంటర్వ్యూ, అక్కడి హీరోల గురించి చెప్పిన మాటలు, తమిళలు గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు అక్కడ ఎన్టీఆర్ కు మంచిపేరు తెచ్చిపెట్టాయి. దేవర సినిమాకు ఇది చాలా హైప్ తీసుకువచ్చింది.
ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న పవన్
సరిగ్గా ఇటువంటి సమయంలోనే తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, పంది కొవ్వు, జంతు కొవ్వులతోపాటు చేపనూనె, ఇతర పదార్థాలను కలిపారనే నివేదిక బయటకు రావడంతో దేశమంతటా సంచలనంగా మారింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. సత్యం సుందరం సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్తీ హైదరాబాద్ వచ్చారు. అక్కడ విలేకరులు లడ్డూ గురించి ప్రశ్నించగా ఇది చాలా సున్నితమైన విషయమని, మాట్లాడనంటూ ఆయన నవ్వుతూ తోసిపుచ్చారు. ఇందులో కార్తీ తప్పేంలేదని ఏపీ, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.

బాయ్ కాట్ చేసే అవకాశం ఉంది
అయితే పవన్ కల్యాణ్ లోతుగా విశ్లేషణ చేయకుండా కార్తీపై మండిపడ్డారు. దీంతో కార్తీ పవన్ కల్యాణ్ కు క్షమాపణలు తెలిపారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ పవన్ కల్యాణ్ కార్తీకి ట్వీట్ చేశారు. యథాలాపంగా మాట్లాడినవేనని అర్థం చేసుకున్నానన్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కార్తీచేత పవన్ కల్యాణ్ సారీ చెప్పించడంపై తమిళులు మండిపడుతున్నారు. అసలే వారికి స్వాభిమానం, మనవారు, మన భాష, మన ప్రాంతం అంటే తమిళ జాతి మొత్తం ఒక్కటవుతుంది. ఇటువంటి సమయంలో పవన్ కల్యాణ్ పై తమిళులు మండిపడుతున్నారు. ఈ తరుణంలోనే విడుదలవుతున్న దేవరకు ఇది పెద్ద మైనస్ గా మారింది. అసలే దేవరకు అక్కడ థియేటర్లు ఇవ్వకపోవుతుండటంతో డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తమిళలు భావోద్వేగాలకు సంబంధించిన విషయంగా కార్తీ సారీ మారడంతో దేవర చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు బాయ్ కాట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications