Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టార్ హీరో సినిమా ఫేక్ కలెక్షన్లు ..? బయటబడ్డ అసలు నిజం

ఈ రోజుల్లో ఏ సినిమా హిట్ అవుతుందో , ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో చెప్పడం కష్టం. సినిమాలు హిట్ కావాలంటే సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీని దాటుకుని బయటపడాల్సి ఉంది. అలా దాటుకుని వచ్చిన సినిమాలు మాత్రమే హిట్‌గా నిలుస్తున్నాయి. ఈ మధ్య సినిమా వాళ్లు కూడా బాగానే తెలివి మీరారు. సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ , మా సినిమా హిట్ అని సెలబ్రేషన్స్ చేసుకోవడం ఫిల్మ్ మేకర్స్‌కు పరిపాటిగా మారింది. తాజాగా ఓ సినిమా విషయంలో సరిగ్గా ఇలానే జరిగింది. సినిమాకు వచ్చిన టాక్‌కు , వాళ్లు ప్రకటించిన కలెక్షన్లకు ఎక్కడా సంబంధం లేదనే ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా మరేదో కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ.

సెప్టెంబర్ 25న విడుదలైన ఈ యాక్షన్ డ్రామా 'ఓజీ' (OG)...కేవలం పవన్ కెరీర్‌లోనే కాదు, ఏకంగా ఈ 2025 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు (హయ్యెస్ట్ గ్రాసర్) సాధించిన తెలుగు సినిమాగా ఓజీ నిలిచిందని మూవీ మేకర్స్ ప్రకటించారు.సుజీత్ డైరెక్షన్లో వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ కథాంశం, విడుదలైన మొదటి రోజు నుంచే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను అందుకుంది. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం... ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹308 కోట్లకు పైగా వసూళ్లు చేసి, పవర్ స్టార్ క్రేజ్ పవర్ ఏంటో చూపించింది.

Pawan Kalyan s OG vs Venkatesh s Sankranthiki Vastunnam Why 308 Cr Worldwide Still Fell Short of Telugu States Record
అయితే, 'ఓజీ' సాధించిన ఈ అద్భుతమైన విజయం వెనుక ఒక ఆసక్తికరమైన అంశం దాగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 'ఓజీ' నెంబర్ 1గా నిలిచినా, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వసూళ్ల విషయంలో మాత్రం ఈ చిత్రం మరో సినిమాను అధిగమించలేకపోయింది.

ఆ రికార్డ్ మరేదో కాదు, వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం సొంతం. 'సంక్రాంతికి వస్తున్నాం' తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్లు: ₹195.45 కోట్లు,'ఓజీ' తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్లు: ₹190.45 కోట్లు. కేవలం తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే, వెంకీ మామ చిత్రం దాదాపు ₹5 కోట్లకు పైగా లీడ్‌లో ఉంది. 'ఓజీ'కి భారీ ఎత్తున టికెట్ ధరలు (ప్రీమియర్ షోలకి ఏపీలో ₹1000, తెలంగాణలో ₹800 అదనంగా) ఉన్నప్పటికీ, ఫైనల్ రన్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లను దాటలేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అలాగే ఓజీ సినిమా విశాఖ, ఈస్ట్, వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు వంటి కోస్తా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

'సంక్రాంతికి వస్తున్నాం' కేవలం తెలుగులోనే విడుదలై సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ పొందగా, 'ఓజీ' మాత్రం ఐదు భాషల్లో విడుదలై అంతర్జాతీయ వసూళ్లను పెంచుకుంది.పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'ఓజీ' రిజల్ట్‌తో అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే, ఇప్పటివరకు ₹100 కోట్లు లేని స్టార్ హీరోగా ఉన్న పవన్, ఈ చిత్రంతో ఏకంగా ₹300 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+