నా భర్త పట్టించుకోవడం లేదు..పవన్‌పై భార్య సంచలన పోస్ట్
భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో 'పవర్ స్టార్'గా, 'కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్'గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పవన్ సింగ్ వ్యక్తిగత జీవితం మాత్రం సినిమా కథను తలపిస్తుంది. తన వైవాహిక జీవితంలో ప్రేమ, విషాదం, విడాకులు, వివాదాలు అన్నీ ఉన్నాయి.
మొదటి భార్య నీలం సింగ్ - విషాదాంతం:
పవన్ సింగ్ మొదటిసారిగా నీలం సింగ్‌ను 2014లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కేవలం 5 నెలలకే, 2015లో నీలం సింగ్ ఆత్మహత్య చేసుకోవడం అభిమానులను, పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణానికి గల కారణాలు నేటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయి. పవన్ సింగ్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు జరిగిన ఈ సంఘటన ఆయన జీవితంలో ఒక విషాద అధ్యాయంగా మిగిలిపోయింది.

రెండో భార్య జ్యోతి సింగ్ - వివాదాస్పద విడాకులు:
తొలి భార్య మరణం తర్వాత పవన్ సింగ్ 2018లో జ్యోతి సింగ్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పవన్ సింగ్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని జ్యోతి సింగ్ ఆరోపించారు. వరకట్నం కోసం వేధింపులు, గర్భవతిగా ఉన్నప్పుడు కూడా కొట్టేవారని, బలవంతంగా అబార్షన్ చేయించారని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో వీరి వైవాహిక జీవితం విడాకుల కోర్టు మెట్లెక్కింది. పవన్ సింగ్ ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ, వీరి మధ్య విడాకుల కేసు ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది.
వివాదాలు, విమర్శలు:
జ్యోతి సింగ్ తన పోస్ట్‌లో గత ఏడేళ్లుగా తాను భర్తకు దూరంగా ఉంటున్నానని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదని వాపోయారు. ''నా భర్త అడుగుజాడల్లో నడిచాను. ఇంత శిక్ష అనుభవించడానికి నేను ఏం తప్పు చేశానో చెప్పాలి'' అంటూ ఆమె తన బాధను వ్యక్తం చేశారు. తన తండ్రి పవన్‌ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేదని, ఇక తనకు ఓపిక లేదని, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని చెప్పారు. అయితే, తల్లిదండ్రులకు చెడ్డపేరు వస్తుందనే భయంతో ఆ పని చేయలేదని ఆమె వెల్లడించారు.
వన్ సింగ్ ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, ఒక ప్రచార కార్యక్రమ వేదికపై హీరోయిన్ అంజలి రాఘవ్‌ను అసభ్యంగా తాకడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆ నటి ఆవేదన వ్యక్తం చేస్తూ భోజ్‌పురి పరిశ్రమను వీడుతున్నట్లు ప్రకటించడం పవన్ సింగ్‌పై ట్రోలింగ్‌ను మరింత పెంచింది.












Click it and Unblock the Notifications