'చరణ్ వేట మొదలెడితే'.. వీడియో లీక్.. ఏంటీ అరాచకం అంటోన్న ఫ్యాన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న మూవీ 'పెద్ది'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 60 శాతం పూర్తయినట్లు సమాచారం. ఫస్ట్ హాఫ్ లాక్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ మూవీ మార్చి 27, 2026 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్దం అవుతుంది. అయితే పెద్ది మూవీ కోసం రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా పెద్ది మూవీకి సంబంధించిన ఓ వీడియో బాగా పాపులర్ అయింది.
గురూజీ చెప్పినట్టు చరణ్ వేట మొదలెడితే , ఆ మిగిలిన వేట కోసం నక్కలు , తోడేలు మిగతా జంతువులు ఎదురు చూస్తాయి 🔥#PEDDI on its way for a biggest blockbuster 💥
— ArunKumar (@arunganta) October 17, 2025
pic.twitter.com/4CPJuNPc9K
ఈ వీడియోలో రామ్ చరణ్ ఒక పెద్ద కొండను ఎక్కుతూ.. మోకాళ్లపై చేతులు పెట్టుకుని అలసిపోయి ఆపసోపాలు పడుతున్నట్లు కనిపించారు. చరణ్ వెనుకనుంచి చిత్ర దర్శకుడు బుచ్చిబాబు తన అసిస్టెంట్లకు చేతులు ఇచ్చి అతి కష్టం మీద లోయ నుంచి బయటకు వస్తున్నట్లు ఉంది. ఇదివరకు ఎవరూ చేయని లొకేషన్స్ లో చిత్రాన్ని షూటింగ్ చేస్తున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వీడియో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ వీడియో చూస్తే మూవీ కోసం చిత్ర యూనిట్ తో పాటు రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు ఎంతలా కష్టపడుతున్నారో అర్థం అవుతోంది.

ఇక ఈ మూవీ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ గా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలో లుక్ కోసం మీసం, గడ్డంతోపాటుగా ముక్కు రింగ్ ధరించారు. ఇక చెర్రీ డైలాగ్ డెలివరీలో కూడా కొత్త యాక్సెంట్ ను ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. చెర్రీ- జాన్వి కెమిస్ట్రీ మూవీకి హైలెట్ గా నిలువనున్నట్లు టాక్. అలాగే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ భారీ యాక్షన్ డ్రామా 2026 మార్చి 27న విడుదల కానుంది.












Click it and Unblock the Notifications