'పెద్ది' సెకండ్ సాంగ్ విడుదల తేదీ ఇదే..!

గ్లోబల్ స్టార్ రామ్​ చరణ్​, టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కతున్న మూవీ 'పెద్ది'. ఈ సినిమా భారీ అంచనాలతో ఈ ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ప్రస్తతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్​ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన 'చికిరి చికిరి' సాంగ్​ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఆ పాటలో రామ్​ చరణ్​ డ్యాన్స్​ కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఈ సాంగ్ ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది మూవీపై మెగా ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ ప్రేక్షకుడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. దాంతో పెద్ది మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ ఈ ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

పెద్ది మూవీ నుంచి రిలీజ్ అయిన చికిరి చికిరి సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. సాంగ్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే ఈ మ్యూజిక్ వీడియో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో 46 మిలియన్ల వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకూ కేవలం యూట్యూబ్ నుండే అన్ని భాషలకు సంబంధించి 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అలాగే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే మారుమోగుతోంది. రామ్ చరణ్, గ్రేస్, డ్యాన్స్, లుక్స్ ఆడియన్స్ కు తెగ నచ్చేశాయి. అటు ఇన్ స్టా గ్రామ్ లో లక్షలాది మంది రీల్స్ చేస్తున్నారు.

Peddi Second Song Release Date Out AR Rahman Magic Returns When to Watch Ram Charan s Next Track

అయితే ఈ మూవీ నుంచి త్వరలోనే రెండో సాంగ్ రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ పాటను డిసెంబర్ నెలలోనే విడుదల చెయ్యాలని భావించినా టెక్నికల్ కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూసినా మెగాస్టార్ చిరంజీవి మూవీ ఉండటంతో వాయిదా వేశారు. అయితే తాజాగా ఫిలిం నగర్ వర్గాల నుంచి ఓ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలోని సెకండ్ సాంగ్ మరో పది రోజుల్లో విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+