రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..!
కొద్దిరోజుల క్రితం హీరో రాజ్ తరుణ్ వివాదం పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని ..తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాకిచ్చింది. మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ నాకు కావాలని తాను ఆయనతోనే ఉండాలని కోరుకుంటానని లావణ్య స్పష్టం చేసింది.
లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్‌తో ఉన్న మాట వాస్తవమేనని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లు తాను సైలెంట్‌గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు.

ఇండస్ట్రీలో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని.. ఆమె ప్రతి విషయానికి బెదిరించేదని.. అందుకే లావణ్య నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. లావణ్య , మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉందని, వారిద్దరూ రూంలో కలిసి ఉన్నప్పుడు తాను చూశానని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే పోలీసులు ఈ కేసుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యకే రివర్స్‌లో నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు వెంటనే సమర్పించాలని పోలీసులు ఆమెకు తెలిపారు. తాజాగా ఈ కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు.
రాజ్ తరుణ్ మోసాలకు పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాత, రాజ్ తరుణ్ ఆమెను మోసం చేశారనే అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. ఈక్రమంలోనే ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయన్నారు. పదేళ్ల పాటు లావణ్య, రాజ్ తరుణ్ ఒకే ఇంట్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. పోలీసులకు సమర్పించింది లావణ్య. లావణ్య సమర్పించిన ఆధారాల ప్రకారం కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు.అయితే ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు.
-
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !!










Click it and Unblock the Notifications