ఓటీటీలో అదరగొడుతున్న కొత్త సినిమా ..అసలు మిస్ కావద్దు

ఇటీవల కాలంలో ఓటీటీలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధారణ లభిస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు , చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.కంటెంట్ బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు పరభాష సినిమాను సైతం నెత్తిన పెట్టుకుంటారనే విషయం తెలిసిందే.

దీనిలో భాగంగానే బాసిల్ జోసెఫ్ నటించిన 'పోన్‌మ్యాన్' (Ponman) సినిమాకు తెలుగు ప్రేక్షకులు డిస్టెన్స్ మార్కులు ఇచ్చేశారు.'పోన్‌మ్యాన్' (Ponman) సినిమా 2025 జనవరి 30న విడుదలైంది. ఈ సినిమాకి జోతీష్ శంకర్ దర్శకత్వం వహించారు. చిన్న పాయింట్‌తో అల్లుకున్న కథను , తెర మీద అద్భుతంగా చూపించారు.ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు మరియు ప్రేక్షకుల ఆదరణ లభించింది.ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, సజిన్ గోపు, లిజోమోల్ జోస్, ప్రధాన పాత్రలు పోషించారు.

Ponman telugu Review and ott release

ఈ సినిమా కథ కేరళలోని కొల్లాం అనే తీరప్రాంత పట్టణంలో జరుగుతుంది. చెల్లెలు స్టెఫీ పెళ్లి కోసం 25 సవర్ల బంగారం అద్దెకు తీసుకుంటారు.పెళ్లికి వచ్చిన చదివింపుల సొమ్ముతో ఆ బంగారం తాలూకు డబ్బులు తిరిగి ఇచ్చేద్దామనుకుంటారు. అయితే బంగారం కొనుగోలుకు డబ్బు సెట్ అవ్వదు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. హీరోగా బాసిల్ జోసెఫ్ ప్రతి సినిమాతో నటుడిగా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు.

ఈ సినిమాలో టైటిల్ పాత్ర పోషించిన బాసిల్.. తన క్యారెక్టర్‌లో జీవించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లే ఓ సగటు మధ్యతరగతి వ్యక్తిగా బాసిల్ నటనకు ఎన్ని మార్కులు ఇచ్చిన తక్కువే అనిపిస్తోంది.ఈ సినిమాని అజిత్ వినాయక ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాకి జస్టిన్ వర్గీస్ సంగీతం అందించారు.

ఈ సినిమాకు సను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందించారు. నిధిన్ రాజ్ ఆరోల్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అందుబాటులో వచ్చింది. ఈ సినిమా 3 కోట్ల బడ్జెట్ తో తీయగా, 18.30 కోట్ల వసూళ్లు సాధించింది.మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను మీరు కూడా ఓసారి చూసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+