పూజాహెగ్డే సరికొత్త చిత్రాలు చూశారా?
బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. వరుసగా సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడుకు ప్రస్తుతం కాలం కలిసిరావడంలేదు. దురదృష్టం వెంటాడుతోందని చెప్పొచ్చు. గతేడాది వరుసగా నాలుగు డిజాస్టర్లు చవిచూడటంతో నిర్మాత, దర్శకులు, హీరోలు అమ్మడును దూరం పెట్టడం ప్రారంభించారు. సినిమా అవకాశాలు రావడంలేదని బాధపడుతున్న తరుణంలోనే గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా బుట్టబొమ్మ నుంచి దూరమయ్యాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే బుట్టబొమ్మ మరోసారి తన అందాలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది. కుర్రకారుకు నిద్ర లేకుండా చేసేందుకు ఎరుపు రంగు దుస్తుల్లో బోల్డ్ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. పూజా అదరగొట్టేసిందని కొందరు కామెంట్లు పెడుతుంటే మరికొందరు మాత్రం ఇదేం డ్రస్ అస్సలు బాగోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

నాగచైతన్య సరసన ఒక లైలాకోసం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన ఈ భామ ముకుంద సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత హృతిక్ రోషన్ సరసన మొహంజదారో సినిమాలో అవకాశం రావడంతో బాలీవుడ్ ను ఏలడానికి టాలీవుడ్ ను వదిలివెళ్లింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో గోడకు కొట్టిన బంతిలా మళ్లీ తిరిగివచ్చింది. ఆ తర్వాత సూపర్ హిట్ సినిమాలు చేయడంతో నిర్మాత, దర్శకులంతా గోల్డెన్ లెగ్ పూజాది అంటూ ఆమె వెంట పడ్డారు. రాధేశ్యామ్, బీస్ట్ తోపాటు సల్మాన్ ఖాన్ సరసన చేసిన చిత్రంతోపాటు మరో చిత్రంతో వరుస పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఎటువంటి సినిమాలు లేకుండా పోయాయి.












Click it and Unblock the Notifications