అతనితో లిప్ లాక్ చాలా డేంజర్..పూజా హెగ్డే
ఒక్కప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరు ఠక్కున పూజా హెగ్దే పేరు చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో 'మహర్షి', ప్రభాస్‌తో 'రాధే శ్యామ్', ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత', అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురం' సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే... అనుహ్యంగా కనుమరుగైంది.
వరుస ప్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుకపడిపోయింది. 'రాధే శ్యామ్', 'ఆచార్య', 'బీస్ట్', 'సర్కస్', 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. పైగా గురుజీ సైతం 'గుంటూరు కారం' సినిమా నుంచి తప్పించడంతో.. పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది.

అయితే అమ్మడుకు వరుస ఊహించని విధంగా మళ్లీ రేసులోకి దూసుకువచ్చింది. విజయ్ ,సూర్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్‌లో కూడా ఓ సినిమాకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే బాలీవుడ్‌లో నటించిన ఓ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పూజా హెగ్డే. షాహిద్ కపూర్ హీరోగా నటించిన 'దేవా' సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమాలో విపరీతమైన రొమాన్స్ , లిప్ లాక్‌లు ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది.కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు...అసభ్య పదజాలం ఉన్న సన్నివేశాలు ఉండంటంతోనే సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చిందని తెలుస్తోంది.సినిమాలో 6 సెకెన్ల లిప్ లాక్ సీన్లకు కూడా సెన్సార్ కట్ చేసినట్టు సమాచారం. షాహిద్ కపూర్- పూజాహెగ్డే మధ్య ఈ లిప్ లాక్ సీన్ డోస్ ఓవర్‌గా ఉండటంతోనే ఆ సీన్లను కట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి షాహిద్ కపూర్‌తో పూజాహెగ్డే ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసిందని సెన్సార్ కట్‌లను చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications