రౌడీ బాయ్‌తో స్టెప్పులేసిన పూజహెగ్దే...వీడియో వైరల్...
రౌడీ బాయ్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు విజయ్‌దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఈ యంగ్ హీరో సంచలనం సృష్టించాడు. ఈ చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు విజయ్. ఆ తర్వాత వచ్చిన గీతాగోవిందంతో అందరి మనసులను గెలుచుకున్నాడు. విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లైగర్ సినిమా ఘోర పరజయాన్ని చివచూసిన రౌడీ భాయ్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తమిళనాడులో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్‌దేవరకొండ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ పూజా హెగ్డే కూడా రావడం విశేషం. తాజాగా విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఈ సినిమాలోని పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. ఫ్యామిలీ స్టార్‌లోని నందనందనా పాటకు రౌడీబాయ్ తో కలిసి బుట్టబొమ్మ పూజాహెగ్దే చిందులేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
విజయ్ తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'లోని 'నందనందనా' పాటకి ఇద్దరూ అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ పాటలో ఉన్న హుక్ స్టెప్పును విజయ్‌తో పాటు పూజా హెగ్దే కూడా స్టేజ్ మీద వేయడంతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. తమిళనాడులోని పెరంబలూర్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, నటి పూజా హెగ్దె పాల్గొన్నారు. ధన లక్ష్మీ శ్రీనివాసన్ కాలేజీలో జరిగిన 'నక్షత్ర 24 ఆర్ట్' ఫెస్టివల్‌కి వీరిద్దరూ ఛీప్ గెస్ట్‌లుగా విచ్చేసారు. ఇక స్టేజ్ మీద విజయ్- పూజ ల డ్యాన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

#VijayDeverakonda and #PoojaHegde dancing for #NandaNandanaa song from #FamilyStar at Dhana Lakshmi Srinivasan College Nakshatra 24 art festival ❤️pic.twitter.com/Xt99lEprHh
— Suresh PRO (@SureshPRO_) March 2, 2024
ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం : ఫ్యామిలీ స్టార్ సినిమాలోని నెల రోజుల క్రితం విడుదలైన 'నందనందన' సాంగ్ ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకుంది. ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా, గోపీ సుందర్ కంపోజ్ చేశారు. ఇక, ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశారు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.












Click it and Unblock the Notifications