వాలుచూపుల వయ్యారాలు.. లంగావోణీలో సింగారాలు!!

బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమాలు ఫ్లాపవుతున్నా మరోవైపు నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉంటుంది. మరోసారి తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తన బోల్డ్ పోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసే పూజా ఈసారి ఎంతో ట్రెడిషనల్ దుస్తులతో ఫొటోలు దిగి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి వైరల్ గా మారాయి.

ట్రెడిషనల్ లుక్ లంగా వోణిలో వయ్యారాలను వలకబోసింది. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలిచ్చింది. ప్రభాస్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, బన్నీ, రామ్‌చరణ్‌ లాంటి స్టార్లతో నటించింది. మరోవైపు యంగ్ హీరోలతోను జోడీ కట్టింది. వరుస విజయాలతో లక్కీ హీరోయిన్ గా మారిన పూజాకు గతేడాది కలిసిరాలేదు. తాను నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 2024లో మాత్రం వరుసగా సినిమాలను లైన్ లో పెడుతోంది.

poojahegde latest photo shoot

తాను పెట్టే ఫొటోలతో కుర్రకారును, నెటిజన్లను కుదురుగా ఉండనివ్వదు. తన బ్యూటిఫుల్ ఫొటోషూట్లతో అదరగొట్టేస్తుటుంది. వాలుచూపులతో రెట్రోలుక్ లో దర్శనమిచ్చింది. ఆకుపచ్చ, లైట్ పింక్ హాఫ్ శారీ కట్టుకొని.. కొప్పునిండా పూలు పెట్టుకుని బాపు బొమ్మలా.. బుట్టబొమ్మలా ఉంది. ఎప్పుడు చూద్దామన్నా హాట్ లుక్ లోనే దర్శనమిచ్చే అమ్మడును ఇలా చూసి నెటిజన్లు ఫిదాయ అంటున్నారు. అందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. వారే వీటిని వైరల్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండతో ప్రారంభించిన జనగణమన ఆగిపోవడం కూడా ఈ అమ్మడుకు నిరాశను మిగిల్చింది. ఈ సినిమా ఆగిపోవడంవల్ల దాదాపు రూ.5కోట్ల రెమ్యునరేషన్ చేజారిపోయినట్లైంది. సాయిధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న గంజా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది అంటున్నారుకానీ చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా వార్త రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+