పచ్చి బూతులతో టైటిల్ & పోస్టర్.. ఇదేం సిగ్గుమాలిన పని !
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి పుణ్యమా అని ఇండియన్ సినిమా రేంజ్ మారిపోయింది. రీజనల్ స్థాయి నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ లో మన సినిమాలు అదరగొడుతున్నాయి. దీంతో ఇతర భాషల్లో సైతం పాన్ ఇండియా చిత్రాలు వస్తున్నాయి. అయితే శృతి మించితే ఏదైనా మంచిది కాదని మరోసారి రుజువు అవుతోంది. పాన్ ఇండియా పిచ్చితో ఈ మధ్య కాలంలో టైటిల్స్ అన్నీ భాషల్లో ఒకటే ఉంచాలని విమర్శల పాలవుతున్నారు.
గత కొంతకాలంగా తెలుగు సినిమాల్లో తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. తెలుగు సినిమాలకు కనీసం తెలుగు పేర్లు పెట్టడం మానేశారా అనే అనుమానం కలుగుతుంది. మరీ విడ్డూరంగా ఈ మధ్య కాలంలో డబ్బింగ్ చిత్రాలను ఒరిజినల్ వెర్షన్ టైటిల్స్ తోనే తెలుగులో రిలీజ్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇదే తరహాలో వ టైటిల్ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పూకి టైటిల్..
ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ మేనల్లుడు కథానాయకుడిగా నటిస్తున్న కొత్త తమిళ చిత్రం 'పూకి'. ఇప్పుడు ఈ టైటిల్ కారణంగా పెద్ద వివాదం నడుస్తోంది. తమిళంలో ఈ పదానికి ఏ అర్థం వస్తుందో పక్కన పెడితే.. తెలుగులో మాత్రం అసభ్యకరమైన పదంగా పరిగణిస్తారు. ఇలాంటి పదాన్ని పాన్-ఇండియా చిత్రానికి టైటిల్ గా పెట్టడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.
విజయ్ ఆంటోనీకి గట్టి దెబ్బ..
విజయ్ ఆంటోనీ తన 'బిచ్చగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. 'నకిలీ', 'హత్య' వంటి చిత్రాలకు తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా టైటిల్స్ మార్చి విజయం సాధించారు. అయితే ఆయన గత చిత్రం 'మార్గన్' తెలుగులో అదే పేరుతో విడుదలైనప్పుడు నెగటివ్ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు ఈ 'పూకి' టైటిల్ విషయంలో కూడా ఇదే పునరావృతం చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు.
Here’s the First look of everyone’s favourite #Pookie 🎀😊
— vijayantony (@vijayantony) September 2, 2025
Tamil - Telugu
Shoot in progress | In cinemas 2026@vijayantonyfilm @GC_Begins @AJDhishan990 #Dhanusha @mrsvijayantony#vijayantony #vijayantonyfilmcorporation #ajaydhishan #love #romcom #PookieTheMovie pic.twitter.com/SBxFEAtoeA
అంతే కాకుండా ఆ పోస్టర్ లో కూడా మిడిల్ ఫింగర్ చూపించడం బూతుకి సంకేతం అని ఫైర్ అవుతున్నారు. మందు బాటిల్స్, సిగరెట్స్ ఇలా అసలు ఏం అనుకొని ఆ ఫోటో రిలీజ్ చేశారని మండిపడుతున్నారు. చిత్ర బృందం సినిమా టైటిల్, పోస్టర్ ల విషయంలో కొంచెం హద్దు మీరకుండా ఉండాలని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications