వేసేవి హిందూ వేషాలు- చేసేవి క్రైస్తవ పనులు: కాపుల నుంచి కన్వర్షన్ అంబాసిడర్

ప్రముఖ నటి పూనమ్ కౌర్ మరోసారి తన ఎక్స్ కు పని చెప్పారు. కొంతమంది హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుని సాగిస్తోన్న హైందవ వ్యతిరేక కార్యకలాపాలపై తనదైన శైలిలో సెటైర్లతో చెలరేగారు. ఎవరి పేరునూ ఆమె తన ట్వీట్ లో మెన్షన్ చేయలేదు గానీ కాపు సామాజిక వర్గాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీలో తిరుమల లడ్డూ వివాదం, మత రాజకీయాలు విస్తృతమైన వేళ.. ఆమె ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరి దృష్టినీ ఆకర్షించింది.

కొందరు హిందువులమని చెప్పుకోవడానికి మాత్రమే అటువంటి కాస్ట్యూమ్స్ ధరిస్తోన్నారని, వేషధారణ చేస్తోన్నారని పూనమ్ కౌర్ అన్నారు. వారి హిందూ ధర్మం దుస్తుల వరకే పరిమితమైందని, వేషధారణ కోసమే హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారని చెప్పారు. నిజానికి- మూడు నెలల పసిపిల్లలకు సైతం కాథలిక్ చర్చిలో బాప్తిసం ఇప్పించిన చరిత్ర వారికి ఉందని గుర్తు చేశారు. "మేము మా వారసత్వాన్ని ఎప్పుడూ మార్చుకునేవాళ్ళం కాదు.." అని తేల్చి చెప్పారు.

Poonak Kaur says Some Embrace Hinduism Themed as Costume While Families Baptize Babies at 3 Months

కాపు సామాజిక వర్గపు గొప్ప వారసత్వం.. ఇప్పుడు ఆర్థొడాక్స్ కాథలిక్ క్రైస్తవంగా మారడాన్ని తన ట్వీట్ లో పూనమ్ కౌర్ ప్రస్తావించారు. దీన్ని ఆర్థొడాక్స్ క్యాథలిక్ క్రిస్టియానిటీ కన్వర్షన్ అంబాసిడర్ గా అభివర్ణించారు. కాపు సామాజిక వర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉందని చెబుతూ.. అటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్లు క్రిస్టియానిటీని అనుసరిస్తోన్నారని, ఈ మతానికి అంబాసిడర్లుగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతోండటం, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవులు అని ఆరోపణలు వెల్లువెత్తుతోండటం.. ఈ వివాదాలు, ఆరోపణలు, విమర్శలకు కేంద్రబిందువులు అయ్యాయి. ఈ పరిస్థితుల్లో పూనమ్ కౌర్.. కాపు సామాజిక వర్గాన్ని ప్రస్తావనలోకి తీసుకుని రావడం అనేది అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు హిందువులుగా చెప్పుకొని, అటువంటి దుస్తులు ధరిస్తూ చర్చిలో మూడు నెలల పసిపాపకు కూడా బాప్టిజం ఇప్పించారని గుర్తు చేయడం ఇందులో హైలైట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+