పవన్ కల్యాణ్‌కు పూనమ్ కౌంటర్..ఆయనకు కావాల్సింది నా దగ్గర లేదంటూ కామెంట్
హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తొలుత సినిమాల్లో నటించిన ఈ భామ, ఆ తర్వాత తమిళ , కన్నడ బాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది.
తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటుంది. అయితే హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌లపై అవకాశం చిక్కినప్పుడల్లా తన అక్కస్సును వెళ్లగక్కుతుంటుంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది. రెండు రోజుల క్రితమే దర్శకుడు త్రివిక్రమ్ గురించి ఓ పోస్ట్ పెట్టింది పూనమ్.

'నాకు త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి తెలుసు. అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఈగోలా గురించి కూడా నాకు తెలుసు. నువ్వు నీ అనుభవంతో చెప్పతున్నావు. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. త్రివిక్రమ్ జీవితాలను నాశనం చేసు వ్యక్తి' అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా పవన్ గురించి పరొక్షంగా ఓ ట్వీట్ చేసింది. నాయకుడు ఒక స్త్రీని ఎలా గౌరవిస్తారో అదే విధంగా వారి అనుచరులు కూడా గౌరవిస్తారు.
నాయకుడిగా ఉండటం అనేది బాధ్యతాయుతమైన విషయం కానీ చాలామంది దానిని స్వీయ కీర్తి కోసం ఉపయోగిస్తారు. ప్రతి రాజకీయ నాయకుడు ఒక లీడర్ కాలేడు అని ఆమె రాసుకొచ్చింది. అయితే తన పోస్ట్‌లో ఎక్కడ కూడా పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించినప్పటికి , ఆమె ఈ పోస్ట్ ఆయన్ను ఉద్దేశించే పెట్టిందని అభిప్రాయపడుతున్నారు. ఈ పోస్ట్‌పై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడూ ఇలానే ఒకరి మీద ఏడుస్తూనే ఉండు.. నీకు ఏమైనా పని ఉందా అసలు.. సినిమాలు లేవు.. సీరియల్స్ లేవు.. నీలాంటి లేజీ ఇడియట్స్‌ని ఇండస్ట్రీ నుంచి తరిమికొట్టి మంచి పని చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, దీనిపై పూనమ్ రియాక్ట్ అవుతూ ..గురూజీ టాలెంట్‌ను తొక్కేస్తాడు.. ఎస్కార్ట్స్‌ని ఎంకరేజ్ చేస్తుంటాడు.. గురూజీకి కావాల్సిన కారెక్టర్ లేదా టాలెంట్ నా దగ్గర లేదు అని రిప్లై ఇచ్చింది పూనమ్ కౌర్. కానీ వెంటనే ఆ రిప్లైని డిలీట్ చేసింది. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications