తెలుగు పాట పాడి మెస్మరైజ్ చేసిన పాప్ సింగర్ ఎడ్ షీరన్.. ఏదంటే ?

బ్రిటన్ కు చెందిన ప్రముఖ పాప్ సింగర్ ఎడ్ షీరన్ ప్రస్తుతం ఇండియా టూర్ లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన బెంగుళూరులో లేటెస్ట్ గా నిర్వహించిన కాన్సెర్ట్ లో తెలుగు సాంగ్ పాడడం హాట్ టాపిక్ గా మారింది. సింగర్ శిల్పారావుతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలోని చుట్టమల్లె చుట్టేశావే పాట పాడి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. మధ్యలో ప్రేక్షకులు సైతం కోరస్ గా 'ఆ' అంటూ అరుస్తూ కేకలు పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ గా మారింది.

ఎడ్ షీరన్ టూర్..

ఎడ్ షీరన్ ఇండియాలో మొత్తం 6 నగరాల్లో కాన్సెర్ట్ లకు ప్లాన్ చేశారు. మొదటగా డిసెంబర్ 30న పూణేలో ఒక ఈవెంట్ జరగగా.. ఫిబ్రవరి 2న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. అలానే ఫిబ్రవరి 5న చెన్నైలో, ఫిబ్రవరి 8న బెంగళూరులో ఈవెంట్ లను చేపట్టారు. చివరగా ఫిబ్రవరి 12న షిల్లాంగ్ లో ఆయన చివరి కాన్సర్ట్ ను నిర్వహించబోతున్నారు. అంతకు ముందు కూడా ఎడ్ షీరన్ భారత్ వచ్చినప్పుడు పలు విషయాలను ప్రస్తావించారు.

Pop singer Ed Sheeran mesmerized by singing a Telugu song What

గతంలోనూ..

2024 మార్చిలో తన కాన్సర్ట్ కోసం భారత్ కు వచ్చినప్పుడు 'ఆర్ఆర్ఆర్' మూవీ గురించి ప్రస్తావించారు. ఆ సినిమాను చూసానని, అందులో 'నాటు నాటు' డ్యాన్స్ చాలా బాగుందని చెప్పడంతో ఆర్ఆర్ఆర్ టీమ్ సైతం స్పందించింది. అంతేకాకుండా ముంబైలో ఎడ్ షీరన్ బాలీవుడ్ సెలబ్రిటీల కోసం స్పెషల్ విందు ఏర్పాటు చేసి.. అందులో షారుక్ తో కలిసి డాన్స్ చేశారు. బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ తో కలిసి అల్లు అర్జున్ బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా పాటకు కూడా స్టెప్పులు వేశారు.

గ్లోబల్ లెవెల్లో ఎన్టీఆర్ క్రేజ్...

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కొమురం భీమ్ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. మవవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో.. ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యారు. రీసెంట్ గానే దిగ్గ‌జ ఫుట్ బాల్ ఆట‌గాళ్లు నెయ్‌మార్‌, టేవెజ్‌, క్రిస్టియానో రొనాల్డో.. బర్త్ డే సందర్భంగా ఫిఫా వరల్డ్ క‌ప్ తన ఇన్‌స్టా పోస్టులో.. వారి ముగ్గురి మొదటి అక్షరాలను NTR అంటూ.. RRR మూవీలోని నాటు నాటు హుక్ స్టెప్ కి వారు డాన్స్ వేస్తున్నట్లుగా రిలీజ్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+