పబ్ లో ప్రముఖ నటి కల్పికపై దాడి.. అలా *** తిట్టారని ఆరోపణ !
తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రముఖ నటి " కల్పిక గణేష్ " సుపరిచితురాలే. 'ఆరెంజ్' సినిమాలో జెనీలియా స్నేహితురాలిగా కనిపించి గుర్తింపు పొందింది కల్పిక. ఆ తర్వాత 'జులాయి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'సారొచ్చారు', 'పడిపడి లేచే మనసు', 'హిట్ - ఫస్ట్ కేస్', 'యశోద' వంటి సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గిన తరుణంలో అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తుంది. తాజాగా ఓ పబ్ లో తనపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. కల్పిక తన పుట్టినరోజు వేడుక కోసం స్నేహితులతో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ప్రిజం పబ్‌కి వెళ్లింది. అయితే అక్కడ బర్త్‌డే కేక్‌ను తీసుకురావడం గురించి పబ్ సిబ్బంది, కల్పిక మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ వాగ్వాదం కాస్త తీవ్రంగా మారి, పబ్ సిబ్బంది ఆమెపై దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది.

అంతే కాకుండా తనపై పబ్ సిబ్బంది అనుచితంగా మాట్లాడినట్లు తెలిపింది. వారు తనను "డ్రగ్గిస్ట్" అంటూ అవమానించారని, బూతులు తిడుతూ దాడికి దిగినట్లు వాపోయింది. తన గౌరవం దెబ్బతిందని, మానసికంగా సైతం వేదన చెందినట్టు వాపోయింది. అలానే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పటికీ.. అక్కడ కూడా తగిన స్పందన లభించలేదని ఆరోపించింది. పోలీసులు తన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోకపోవడం బాధ కలిగించిందని వివరించింది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం వారు సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు సేకరించే పనిలో ఉన్నామని చెప్పుకొచ్చారు.
ఇక గతంలో కూడా నటుడు అభినవ్ గోమటం తన పట్ల అసభ్యకరంగా మాట్లాడాడని, తనను వేధించాడని ఇన్‌స్టాగ్రామ్‌లో, పలు ఇంటర్వ్యూల్లో ఆమె ఆరోపణలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోలీసులను కూడా రిక్వెస్ట్ చేశారు. వరుస వివాదాలతో ఆమె సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నారు.












Click it and Unblock the Notifications