Film industry: 49 ఏళ్ల వయస్సులో విడాకులు తీసుకున్న నటి.. ఎందుకంటే..!
ప్రముఖ మలయాళ నటి మంజు పిళ్లై 49 ఏళ్ల వయస్సులో భర్తతో విడాకులు తీసుకుంది. సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ ను మంజు 2000లో పెళ్లి చేసుకున్నారు. 24 ఏళ్ల తర్వాత వీరు ఇప్పుడు విడాకులు తీసుకున్నారు. తాము విడాకులు తీసుకున్నట్లు వాసుదేవ్ ఓ యూట్యూబ్ ఛానల్ లో ప్రకటించారు. నాలుగేళ్ల నుంచి మంజు, తాను వేరుగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు. మంజు ఇప్పుడు తన భార్య కాదన్నారు.
మంజుతో తన స్నేహం కొనసాగుతోందని పేర్కొన్నారు. పిళ్లై ప్రస్తుతం సక్సెస్ లో కొనసాగుతున్నారని చెప్పారు. ఆమె విజయం సాధిస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిదని తెలిపారు. మంజు పిళ్లై సుజిత్ వాసుదేవ్ ను పెళ్లి చేసుకోక ముందు ముకుందన్ మీనన్ వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె కూడా జన్మించింది. ఆ తర్వాత ముకుందన్ తో మంజు వీడిపోయింది. తర్వాత సుజిత్ వాసుదేవ్ ను పెళ్లి చేసుకుంది.

ముంజు పిళ్లై నటురాలిగానే కాకుండా టీవీ యాంకర్ కూడా చేశారు. ఆమె 1975లో జన్మించారు. ఆమె 17 ఏళ్ల వయస్సులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 1992లో చిత్రపరిశ్రమలోకి వచ్చారు. నీ వరువోళం, గోలంతర వార్త, నింజగల్ సంతుస్తరను, ఆయుష్మాన్ భవ, రావణ ప్రభు, మిస్టర్ బట్లర్, ఓ మైడార్లింగ్ సినిమాల్లో నటించారు. మంజు మలయాలంలోనే కాకుండా తమిళంలో కూడా నటించారు.
ఇక సుజిత్ వాసుదేవ్ విషయానికొస్తే.. ఆయన సినిమాటోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. దృశ్యం, అమర్ అక్బర్ ఆంటోని, అనార్కలీ, అయాల్, మెమొరీస్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. తెలుగులో కూడా పని చేశారు. మిస్ ఇండియా, ఖిలాడీ, బ్రో, ద వారియర్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశాడు.
-
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications