Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనవరి 1 నుంచి PornHub బ్లాక్: అర్ధరాత్రి..!!

Pornhub: అడల్ట్ కంటెంట్‌ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లల్లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న పోర్న్‌హబ్ వెబ్‌సైట్ యాజమాన్యం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త ఏడాదిలో షాక్ ఇవ్వనుంది. జనవరి 1వ తేదీ నుంచి ఈ వెబ్‌సైట్ స్తంభించిపోనుంది. అర్ధరాత్రి 12 గంటలు దాటినప్పటి నుంచి దీని యాక్సెస్ అందుబాటులో ఉండకపోవచ్చు.

ప్రస్తుతానికి అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ వరకు మాత్రమే ఇది పరిమిమైంది. క్రమంగా దీన్ని మిగిలిన రాష్ట్రాలకూ విస్తరింపజేసే ఆలోచనలో ఉంది పోర్‌హబ్ వెబ్‌సైట్ యాజమాన్యం. ఇప్పటికే అమెరికాలో 13 రాష్ట్రాల్లో ఈ వెబ్‌సైట్ యాక్సెస్ ఉండట్లేదు. జనవరి 1 నుంచి ఈ జాబితాలో ఫ్లోరిడా కూడా వచ్చి చేరనుంది.

Pornhub set to block access in Florida on January 1 2025

దీనికి కారణాలు లేకపోలేదు. జనవరి 1 నుంచి ఏజ్ వెరిఫికేషన్ చట్టం ఫ్లోరిడాలో అమలులోకి రావడమే. దీనికి నిరసనగా ఈ వెబ్‌సైట్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సైట్‌ను చూడాలనుకునే ప్రతి ఒక్కరు కూడా తమ వయస్సును ధృవీకరించుకోవడం ఆ రోజు నుంచి తప్పనిసరి అవుతుంది.

దీనికి అవసరమైన ఇమెయిల్ యాక్సెస్‌/ఐడీ యాక్సెస్‌ను ఫ్లోరిడా ప్రభుత్వం నుంచి పొందాల్సి ఉంటుంది. దీన్ని ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానా విధిస్తుంది ప్రభుత్వం. 50,000 డాలర్ల జరిమానా పడుతుంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు దూరంగా ఉంచడం, ఛైల్డ్ పోర్నోగ్రఫీని నిరోధించడం, అడల్ట్ కంటెంట్‌కు బానిసలుగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ఫ్లోరిడా స్టేట్ అసెంబ్లీ ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఇదివరకే ఆమోదించింది. ఇది- 2025 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇది అమలులోకి వచ్చిన వెంటనే పోర్న్‌హబ్ యాక్సెస్‌ను కోల్పోతారు ఫ్లోరిడావాసులు. దీన్ని మళ్లీ చూడాలనుకుంటే ఏజ్ వెరిఫికేషన్‌కు లోబడాల్సి ఉంటుంది. ఈ మేరకు ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లీగల్ ఎఫైర్స్ కఠిన నిబంధనలను రూపొందించింది.

ఈ నిబంధనల వల్ల తమ సైట్ ట్రాఫిక్ తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది పోర్న్‌హబ్ యాజమాన్యం. ఈ నెల 1వ తేదీ నాటికి 20 మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారీ సైట్‌కు. ప్రపంచంలోనే అత్యధికులు వీక్షించే మోస్ట్ టాప్ రేటెడ్ అడల్ట్ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ 100 మిలియన్ల వీడియో వ్యూస్‌లను సొంతం చేసుకుంటోంది.

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడంలో భాగంగా ఇప్పటికే అర్కాన్సాస్, ఇడాహొ, కన్సాస్, కెంటకీ, లూసియానా, మిస్సిసిపి, మోంటానా, నెబ్రస్కా, నార్త్ కరోలినా, ఒక్లహామా, టెక్సాస్, ఉటా, వర్జీనియా రాష్ట్రాల్లో పోర్న్‌హబ్ యాక్సెస్ నిలిచిపోయాయి. ఇప్పుడీ జాబితాలో ఫ్లోరిడా కూడా చేరబోతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+