ట్రోల్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్.. మళ్లీ ఫిట్ గా మారిన పవన్ డైట్ సీక్రెట్ ఇదే !
సినిమా అనే రంగుల ప్రపంచంలో గ్లామర్ కే టాలెంట్ తో పాటు గ్లామర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనడంలో సందేహం అక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో అవకాశం దక్కించుకోవడానికి అందమే తొలి మెట్టు కూడా అవుతోంది. అందుకే నటీనటులు ఎప్పుడూ స్టైలిష్‌గా, ఫిట్‌గా కనిపించాల్సి ఉంటుంది. ఇక మారుతున్న కాలానుగుణంగా సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై బలంగా నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో సెలబ్రెటీల ఫిజికల్ అప్పియరెన్స్ పై ట్రోల్స్ రావడం గమనించవచ్చు.
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దేశ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తన మొదటి సినిమాలోనే రియల్ స్టంట్స్ చేసి అదరగొట్టారు. ఆ యాక్షన్ స్టంట్స్ ఇప్పటికే ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటాయ్. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత.. పవన్ శారీరకంగా కొంచెం మార్పు చెందారు. ఫిజికల్ ఫిట్‌నెస్ ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు అని ఓపెన్ టాక్ ఉంది.

ఇటీవల తన భార్యతో కలిసి కుంభమేళాలో పాల్గొన్నప్పుడు షర్ట్ లేకుండా స్నానం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలపై ట్రోల్స్ భారీగా వచ్చాయి. పవన్ కి పొట్ట వచ్చిందని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్ల కాస్తా పవన్ దృష్టికి వెళ్లినట్టు సమాచారం అందుకే వారందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్.
తన పర్సనల్ హెయిర్ స్టైలిష్.. కొత్తగా ఏర్పాటు చేసుకున్న సలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. బ్లూ టీషర్ట్, బ్లాక్ షార్ట్ ధరించి వచ్చిన పవన్‌ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. అందులో ఆయన పొట్ట పూర్తిగా తగ్గినట్టు కనిపించింది. ఈ మార్పుతో పాటు, పవన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటని ఆరా తీస్తున్నారు.
పవన్ డైట్ ప్లాన్ వైరల్..
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రోజుకు ఒక్కసారే భోజనం చేస్తున్నారట. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బ్లాక్ కాఫీ రెండు సార్లు, ఆ తర్వాత ఒక సాదా కానీ పోషకాహారంతో కూడిన భోజనం. రాత్రికి ఫ్రూట్ జ్యూస్ లేదా మజ్జిగ మాత్రమే తీసుకుంటున్నారట. ఈ సింపుల్ డైట్ ప్లాన్‌తో ఆయన దాదాపు 10 కిలోల బరువు తగ్గారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications