రామ్‌చరణ్ వద్ద అప్పు చేసిన పవన్ కల్యాణ్?
జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ 70వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో పిఠాపురం నుంచి సంచలన విజయాన్ని కైవసం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోను గెలుపొంది దేశం మొత్తం తమవైపు చూసేలా చేసుకుంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టారు. తనకు ఓఎస్‌డీగా సమర్థుడైన యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజను నియమించుకున్నారు. కేరళలో విధులు నిర్వహిస్తున్న కృష్ణతేజను ఏపీకి పంపించాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార సమయంలో కుటుంబ సభ్యులంతా హాజరై సంతోషంలో మునిగారు.
సొంత డబ్బులతో రైతులకు పరిహారం
ఎన్నికలకు ముందు పవన్ రాష్ట్రమంతటా పర్యటించి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు తన సొంత డబ్బునే లక్ష రూపాయల చొప్పున పంపిణీ చేశారు. సినిమాలద్వారా తనకు వచ్చే పారితోషికాన్ని ఇందుకు కేటాయించారు. దీనిపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వద్ద కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయ పార్టీని నడపడానికో, ఎన్నికల్లో పోటీచేయడానికో కాదు.. తాను సినిమాల్లోకి రాకముందు తీసుకున్న అప్పు.

వడ్డీతో సహా చెల్లిస్తాను
పాకెట్ మనీగా చిరంజీవి ఇచ్చిన డబ్బులు చాలకపోవడంతో రామ్ చరణ్ వద్ద నుంచి కొంత సొమ్మును అప్పుగా తీసుకునేవారు. ఎంత తీసుకున్నానో అంత వడ్డీగా ఇస్తానని చెర్రీకి చెప్పారు. అంతేకాదు.. చిన్న పిల్లాడివి నీకు ఇన్ని డబ్బులెందుకు? అని గట్టిగా చెప్పి వాటిని కూడా తానే తీసుకునేవారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత చెప్పింది.
అలాగే పవన్ కల్యాణ్, రామ్ చరణ్ కూడా వేర్వేరు సందర్భాల్లో ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. పాకెట్ మనీకి డబ్బులు తీసుకున్న పవన్ కల్యాణ్ ఈరోజు లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచే స్థాయికి చేరుకున్నారని, అందుకు ఎంతో శ్రమించారని, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ శ్రమకు తగిన ఫలితం దక్కిందని మెగా కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
-
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications