పవన్‌కల్యాణ్ ఎన్ని ఇండస్ట్రీ హిట్లు వదులుకున్నారో తెలుసా?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్ గా రాణించారు. ప్రస్తుతం ఆయన దగ్గర నుంచి హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు రావాల్సి ఉంది. రాజకీయాల్లో బిజీగా ఉండటంవల్ల వీటికి ఆయన కాల్షీట్లు కేటాయించలేకపోతున్నారు. ఎలాగోలా కష్టపడి హరిహర వీరమల్లు సినిమాను పూర్తిచేయగలిగారు. మార్చి 28వ తేదీన విడుదల కాబోతోంది. సినీరంగంలోకి పవన్ ప్రవేశించిన తర్వాత ఆయన దగ్గరకు చాలా కథలు వచ్చాయి. దర్శకులు ఎంతోమంది వాటిని వినిపించారు. అయితే కథ నచ్చక చాలావరకు తిరస్కరించారు. అలా వద్దనుకున్న సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి.
నాలుగు కథలు వినిపించినా ఒక్కదానికీ ఓకే చెప్పలేదు
బద్రి సినిమాతో పరిశ్రమలోకి ప్రవేశించిన పూరీ జగన్నాథ్ ఆ తర్వాత నాలుగు కథలను పవన్ కు వినిపించగా ఒక్కదానికి కూడా ఆయన ఓకే చెప్పలేదు. ఇట్లు శ్రాణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు ముందుగా పవన దగ్గరకే వచ్చాయి. కానీ చేయనన్నారు. దీంతో వాటిని రవితేజతో తెరకెక్కించి అతన్ని పూరీ జగన్నాథ్ స్టార్ హీరోగా మార్చారు. తర్వాత కూడా పట్టు వదలకుండా పోకిరి సినిమా కథ వినిపించినా పవన్ కల్యాణ్ అంగీకరించలేదు. దీంతో మహేష్ బాబుతో తెరకెక్కించగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమా కథను కూడా పవన్ కే వినిపించారు. అయితే కథ వినే సమయంలో పవన్ నిద్ర పోవడంతో ఆయనకు ఆసక్తి లేదని భావించిన త్రివిక్రమ్ మహేష్ బాబుతో తెరకెక్కించి చిరకాలం గుర్తుండిపోయే క్లాసిక్ సినిమాను అందించారు.

అవి చేయనందుకు బాధపడుతున్న పవన్ అభిమానులు
మల్టీస్టారర్ సినిమా తీయాలని భావించిన నిర్మాత దిల్ రాజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీశారు. అయితే మహేష్ బాబుకు బదులుగా ముందుగా పవన్ కల్యాణ్ ను కలిసి కథ వినిపించారు. ఆయన నో చెప్పారు. దీంతో వెంకటేష్, ప్రిన్స్ కలయికలో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిరపకాయ్ సినిమా కూడా ముందుగా పవన్ దగ్గరకే చేరింది. దానికి కూడా పవన అంగీకరించలేదు. దీంతో హరీష్ శంకర్ రవితేజతో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తమ పవర్ స్టార్ ఈ సినిమాలన్నీ చేసివుంటే ఎంతో బాగుండేదికదా అంటూ అభిమానులు బాధపడుతున్నారు.












Click it and Unblock the Notifications