రాజంటే "రెబల్" ఏరా.. రాజాసాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కోట్లా !
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో తొలిసారిగా హారర్ జానర్‌ను టచ్ చేసిన సినిమా 'ది రాజాసాబ్'. ఇప్పటివరకు యాక్షన్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ఈసారి రొమాంటిక్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వాహబ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. విజువల్స్, సెట్ డిజైన్స్‌లో ఎక్కడా రాజీ పడలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి అలాంటి లైట్ హార్ట్ కామెడీ చూడటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే హ్యూమర్ సీన్స్, డైలాగ్స్ థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇది ప్రభాస్‌ను 'డార్లింగ్' రోజులకు తీసుకెళ్లిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక నెగటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, కథనం ఆశించిన స్థాయిలో ఎలివేట్ కాలేదని విమర్శలు వస్తున్నాయి. హారర్ ఎలిమెంట్స్‌ను మరింత భయంకరంగా చూపించాల్సిందని, ఫాంటసీ ట్రాక్ క్లారిటీగా లేకపోవడంతో కన్ఫ్యూజన్ ఏర్పడిందని కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్..
క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, 'ది రాజాసాబ్' తొలిరోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హారర్ ఫాంటసీ సినిమాల్లో ఇదే అతి పెద్ద తొలిరోజు గ్రాస్ అని తెలిపింది.
ఓవర్సీస్ మార్కెట్‌లోనూ బలమైన స్టార్ట్..
విదేశీ మార్కెట్లలోనూ 'ది రాజాసాబ్' బలంగా మొదలైంది. ఓవర్సీస్‌లో రూ.25 నుంచి 30 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు చేసిందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ముందస్తు బుకింగ్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రావడం గమనార్హం. భారత్‌లో టికెట్ బుకింగ్స్ మరింత ముందుగానే ప్రారంభించి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మొత్తంగా చూస్తేప్రభాస్ ని డీల్ చేయడంలో మారుతీ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. పండగ రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. దానికి తోడు ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ కనిపించే సీన్స్ నేటి నుండి యాడ్ చేస్తామని మారుతి తెలిపాడు. ఈ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా ఎక్కువ రీచ్ అవుతాయి. కొద్దిగా ప్రమోషన్స్ చేస్తే పండగ రోజుల్లో ఇంకా భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
-
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా












Click it and Unblock the Notifications