ప్రభాస్ గ్యారేజ్ లో కార్ల విలువ తెలుసా?
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తన రాబోయే చిత్రం సలార్ కోసం గతంలో కంటే ఎక్కువగా శరీరాన్ని చాలా ఫిట్ గా ఉంచుకున్నారు. అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? ఎప్పుడెప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ చేద్దామా? అనే ఆత్రుతలో ఉన్నారు. డిసెంబర్ 22న భారీస్థాయిలో విడుదల కాబోతోంది.
ప్రభాస్ గ్యారేజీలో చాలా బోల్డ్, సాలిడ్‌గా కనిపించే కార్లు చాలా ఉన్నాయి. తనకు లగ్జరీ, ఎక్కువ సౌకర్యంగా ఉండే వాహనాలంటే మహా పిచ్చి. సూపర్ కార్ లంబోర్ఘిని, అవెంటడోర్ రోడ్‌స్టర్, హై క్లాస్ SUV ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వరకు అన్నీ ఉన్నాయి. రోల్స్ రాయిస్ ఫాంటమ్, జాగ్వార్ XJR, BMW X3 మరియు BMW X5 వంటి కార్లు కూడా ఉన్నాయి. ప్రభాస్ తన లాంబోర్గినీ అవెంటడోర్ రోడ్‌స్టర్‌ను నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సూపర్ కారు 729.51 bhp అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండు సీట్లే ఉంటాయి. ఇందులో అత్యంత శక్తివంతమైన 6498 cc ఇంజన్ ఉంది.

లంబోర్ఘిని అవెంటడోర్ రోడ్‌స్టర్ ఆటోమేటిక్ ట్రాన్సిషన్‌తో వస్తుంది. మైలేజ్ 5.0 kmpl. ఈ పెట్రోల్ కారులో 90 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. కన్వర్టిబుల్ కారు. గ్రౌండ్ క్లియరెన్స్ 125 మిమీ. హై స్పీడ్ కారు. ఇది 5500 rpm వద్ద 690Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, టచ్‌స్క్రీన్, పవర్ విండోస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్లాయ్ వీల్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఇంజిన్ 12 సిలిండర్లతో వస్తుంది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు.












Click it and Unblock the Notifications