ప్రభాస్ కు డూప్ గా నటించే వ్యక్తి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
పాన్ ఇండియా రెబల్ స్టార్ గా, డార్లింగ్ గా దేశవ్యాప్తంగా అందరి హృదయాలను దోచున్నాడు ప్రభాస్. ప్రభాస్ లాంటి ఆరడుగులకు పైగా ఉండే కటౌట్ సినిమాల్లో ప్రతి నాయకులను చితక్కొడుతుంటే ప్రతి ఒక్కరూ ఆ సన్నివేశాలను ఆస్వాదిస్తుంటారు. అటువంటి పోరాట దృశ్యాలకు ప్రభాస్ లాంటి పర్ ఫెక్ట్ కటౌట్ మాత్రమే సెట్ అవుతుందని అభిమానులు గర్వంగా చెబుతుంటారు. ప్రతి సినిమాలోను పోరాటాలకు సంబంధించిన సన్నివేశాలు కొన్ని ప్రమాదకరంగా రూపొందిస్తుంటారు. అవి చూసినప్పుడు తమ హీరోకు ఏమన్నా అయిందా? అంత రిస్క్ తీసుకుంటే ఎలా? అంటూ అభిమానుల గుండెలు గుభిల్లుమంటుంటాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ప్రభాస్ సరసన ఎంతో దగ్గరగా ఒక వ్యక్తి ఫొటో దిగారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. అతను చాలా సినిమాల్లో డూప్ గా నటిస్తుంటాడు. ప్రభాస్ సినిమాల్లో డూప్ గా నటిస్తుంటాడు. కల్కి సినిమాలో కూడా చేస్తున్నాడు. అలాంటి పాత్రల్లో కనిపించినందుకు రూ.30 లక్షల పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది.

సినిమాను బట్టి, చేసే రిస్కీ షాట్లను బట్టి అతని పారితోషికం కూడా మారుతూ వస్తుంటుంది. తన సినిమాల్లో డూప్ గా చేస్తున్న ఈ వ్యక్తి అంటే డార్లింగ్ కు ఎంతో ఇష్టం. అతనకు వ్యక్తిగతంగా కూడా ఎంతో సాయం చేస్తుంటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నాడు. ఆరోగ్య పరంగా కూడా కొన్ని ఇష్యూలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయికానీ వాటికి సంబంధించి ఎక్కడా అధికారిక ప్రకటనైతే లేదు. త్వరలోనే మరో నాలుగు క్రీజీ ప్రాజెక్టులను ప్రభాస్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ప్రకటన కోసం డార్లింగ్ అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications