ప్రభాస్ 'ఫౌజీ', మహేష్ 'వారణాసి'.. రిలీజ్ డేట్స్ ఇవేనా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఫౌజీ'. వార్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రం తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలపై ప్రస్తుతం ఓ వార్త నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ఈ మూవీని ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఫౌజీ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఇమాన్వీ నటిస్తోంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ అందిస్తున్నాడు. అలాగే సంగీతం విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది.
మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి చిత్రం రిలీజ్ పైనా ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 7న రిలీజ్ అంటూ వారణాసి పట్టణంలో హోర్డింగ్ లు వెలిశాయి. అయితే ఈ హోర్డింగ్స్ లో సినిమా పేరు గానీ నటీనటుల వివరాలు గానీ లేకపోవడంతో అసలు వీటిని ఎవరు ఏర్పాటు చేశారన్న ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి.

ఇక ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
-
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications