ప్రభాస్‌కు ఇష్టమైన ఒకే ఒక సినిమా

ప్రభాస్ అంటే మనకు గుర్తొచ్చేది భారీ కటౌట్.. యాక్షన్ సీన్లు. అయితే ఆ కటౌట్ వెనుక ఒక క్లాసిక్ సినిమా ప్రేమికుడు కూడా ఉన్నాడు. ప్రధానంగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం అంటే ప్రభాస్‌కు చాలా ఇష్టం. మణిరత్నం చిన్న పాత్ర ఇచ్చినా చేయడానికి డార్లింగ్ సిద్ధంగా ఉంటారు. ప్రభాస్ సినిమా రంగంలోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన అతికొద్ది చిత్రాల్లో 'గీతాంజలి' ఒకటి. నాగార్జున హీరోగా నటించిన ఈ కల్ట్ క్లాసిక్ అంటే ప్రభాస్ కు విపరీతమైన పిచ్చి. థియేటర్లలోకానీ, టీవీల్లోకానీ ఇప్పటివరకు ఈ సినిమాను 100సార్లకు పైగా చూసినట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పారు.

గీతాంజలి ఇచ్చిన ప్రేరణే

ఈ విషయాన్ని డార్లింగ్ కూడా చాలా గర్వంగా చెబుతుంటారు. ఆ సినిమాలోని విజువల్స్, ఇళయరాజా అందించిన అద్భుతమైన సంగీతం, ముఖ్యంగా నాగార్జున నటన తనను బాగా ఆకట్టుకున్నాయని, సినిమాలోని ఆ మూడ్, వర్షం సీన్లు, తక్కువ డైలాగులతో పండించిన ఎమోషన్స్ సినిమాల పట్ల ఒక ప్రత్యేకమైన ఇష్టాన్ని కలిగించాయన్నారు. 'రాధే శ్యామ్' వంటి క్లాసిక్ లవ్ స్టోరీ చేయడానికి కూడా ఎక్కడో ఒకచోట గీతాంజలి సినిమా ఇచ్చిన ప్రేరణే కారణమనే అభిప్రాయం ఉంది.

Prabhas has said in several interviews that he really likes the film Geethanjali directed by Mani Ratnam

దర్శక మాంత్రికుడు మణిరత్నం

ప్రభాస్ దృష్టిలో మణిరత్నం అంటే ఒక దర్శక మాంత్రికుడు. పాత్రలను డిజైన్ చేసే విధానం, ప్రతి ఫ్రేమ్‌లో ఉండే సహజత్వం ఆయనకు బాగా నచ్చుతుంది. అందుకే ఆయన మణిరత్నంను తన డ్రీమ్ డైరెక్టర్ అని పిలుచుకుంటారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి2 తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన సమయంలో, మణిరత్నం తన కలల ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్' కోసం ప్రభాస్‌ను సంప్రదించారని వార్తలు వచ్చాయి. ఆ సినిమాలో జయం రవి పోషించిన రాజరాజ చోళుడు పాత్రకు ప్రభాస్ బాగా సరిపోతాడని మణిరత్నం భావించారుకానీ షెడ్యూల్స్ బిజీగా ఉండటంవల్ల ఆయన సినిమాలో ప్రభాస్ చేయలేకపోయారు. అభిమానులు మాత్రం భవిష్యత్తులోనైనా మణిరత్నం దర్శకత్వంలో ప్రభాస్ గీతాంజలి లాంటి మంచి ప్రేమకథా చిత్రం చేయాలని కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+