కూకట్ పల్లిలో ప్రభాస్ సంచలన రికార్డ్
డార్లింగ్ ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని సినీ పరిశ్రమకు చెందినవారు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహించారు. ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో 230 అడుగులతో దేశంలోనే అతి పెద్దదైన కటౌట్ ఏర్పాటు చేశారు. తాజాగా ఈ కటౌట్ దేశంలోనే అత్యంత ఎత్తైన కటౌట్ గా రికార్డు సృష్టించింది. సలార్ స్టిల్ తో దీన్ని ఏర్పాటు చేశారు. అభిమానులు ఈ కటౌట్ కు పాలాభిషేకం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి వైరల్ గా మారాయి.

బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సలార్, కల్కి 2898ఏడీ, రాజా డీలక్స్, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నారు. సలార్ షూటింగ్ పూర్తయింది. డిసెంబరు 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి 2898ఏడీ చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications