ప్రభాస్ 'కల్కి 2' కు టైటిల్ ఇదే.. వామ్మో ఈ రేంజ్ విధ్వంసం అస్సలు ఊహించలేదు..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రాజాసాబ్ చిత్రంతో అలరించిన ప్రభాస్.. ఇప్పుడు స్పిరిట్, ఫౌజీ చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. అయితే 2024లో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఆ మూవీ పార్ట్-2 కోసం సెలబ్రిటీల నుంచి సాధారణ సినీ అభిమానుల వరకు అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సీక్వెల్ పై రోజురోజుకూ క్రేజ్ భారీగా పెరిగిపోతుంది.
అయితే తాజాగా కల్కి 2 మూవీపై ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి 'కర్ణ 3102 BC' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక కల్కి 2 షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. తొలి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించినట్లు సమాచారం. ఇక రెండో షెడ్యూల్ లో త్వరలోనే ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం అందుతోంది.

ఇక కల్కి 2 మూవీ పూర్తిగా కర్ణుడి చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. కర్ణుడి పునర్జన్మ ఎలా జరిగింది అనే దానిపైనే ప్రధానంగా ఉంటుందని టాక్. అలాగే కల్కి మొదటి భాగంలో మహాభారతం ఎపిసోడ్స్ కేవలం 5 నిమిషాలు మాత్రమే చూపించారు. కానీ రెండో భాగంలో ఏకంగా 30 నిమిషాలకు పైగా చూపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ప్రధానంగా కర్ణుడి చుట్టూ తిరుగుతుంది కాబట్టే పార్ట్ 2 కు 'కర్ణ 3102 BC' అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications